
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.

సాయంత్రం ఆరు దాటితే..
ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్‌మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్‌లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.
అవినాష్ కోసం కోన వెంకట్
బిగ్‌బాస్‌కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్‌దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్‌కు బూస్ట్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment