కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్‌లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
మందు తాగుతానన్న యష్మి
యష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు.
టాప్ 5లో ఎవరంటే?
తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.
అవినాష్‌తో సినిమా
సన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు.
అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడు
అలా నిఖిల్‌కు బాద్‌షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్‌ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్‌దీప్ వచ్చేశారు.
రెండు రోజులు నాతోనే
అమర్‌దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.
మగాళ్లపై ఆడాళ్ల విజయం
ర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.
అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్
చివరగా అవినాష్, తేజ నామినేషన్‌లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్‌ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు.
టెన్షన్‌తో చచ్చిపోయిన తేజ
బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment