‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు.
- డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్‌గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్‌తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం.
- ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్‌పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు.
- నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు డైరెక్టర్స్‌కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను.
- మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment