september 1
-
జాతీయ పోషకాహార వారోత్సవం 2024 : అందంగా ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో జీవించాలంటే!
మనిషి ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే సరైన పోషకాలు అవసరం. కుల, మత, లింగ, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి శిశువుల నుంచి వృద్ధుల దాకా పోషకాహారం చాలా కీలకం. పోష కాహారంపై శ్రద్ధ పెట్టకపోతే జీవితం అతలాకుతలమవుతుంది. అనేక వ్యాధులకు మూలంగా మారి పోతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి, శరీరానికి పోషకాహారం ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాన్ని పాటిస్తారు. సెప్టెంబరు 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని నిర్వహిస్తారు.1982లో కేంద్రం (ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్) ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. పోషకాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ వార్షిక కార్యక్రమం భాగంగా పోషకాహార లోపాన్ని గుర్తించడం, పరిష్కరించడం. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో , వ్యాధులను నివారించడంలో సమతుల్య ఆహారం కీలక పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.ముఖ్యమైన పోషకాలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ శరీరానికి కావల్సిన పోషకాలు. ముఖ్యంగా పిలల్లో ఈ పోషకాల ప్రాముఖ్యత పాత్ర చాలా ఉంది. వారి మానసిక,శారీరక ఎదుగుదలకు వికాసానికి, ఎముకల బలానికి చాలా అవసరం., పోషకాహారం లోపంతో శారీరక బలహీనత ఏర్పడి, అనేక రోగాలు కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వైరస్ల దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది.పోషకాహారం అంటే?కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఫైబర్ల మిశ్రమాలతో సంపూర్ణ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో సహజంగా లభించే వివిధ రకాల తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, మొలకెత్తిన గింజలు, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకుండా ప్రొటీన్ ఫుడ్‌పై శ్రద్ధపెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. చక్కెర, ఉప్పు వాడకాన్ని నియంత్రించాలి. కూల్ డ్రింక్‌లు, అనారోగ్య కరమైన కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన, ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలను పరిమితం చేసుకోవాలి. హెర్బల్ టీలను ఎంచుకోవడం బెటర్. -
ఆ పాయింట్‌తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్‌గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్‌పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు డైరెక్టర్స్‌కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్ దేవరకొండ
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్‌లో, ఫెయిల్యూర్స్‌లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్) థ్యాంక్స్. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’ చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్ కాబోతోంది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘శివ నిర్వాణతో మా బ్యానర్లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్. ఈ వేడుకని గ్రాండ్‌గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ, కెమెరామేన్ జి.మురళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులకు ఊరట: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
న్యూడిల్లీ: వంట గ్యాస్ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలో రూ.91.50 తగ్గింది. ఈ రోజు (సెప్టెంబర్ 1, 2022) నుంచి ఈ ధర అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. (Zomato: నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్ ఆఫర్) తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో రూ. 1798.5గా ఉంటుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర ఈ ఏడాది మేలో రూ.2,354 వద్ద ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం వరుసగా ఐదు నెలలో ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయం ఉంటుందనేది తెలిసిన సంగతే. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) National Oil Marketing companies have reduced commercial 19-kg LPG cylinder cost by Rs 91.50 effective from today, 1st February. 19 kg commercial cylinder will cost Rs 1907 in Delhi from today: Sources — ANI (@ANI) February 1, 2022 -
ఒకటో తేదీకల్లా అసెంబ్లీ రెడీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఏడో తేదీ నుంచి మొదలుకానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల కోసం ఒకటో తేదీ కల్లా సభ్యుల సీటింగ్, ఇతర ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేయనుంది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యుల బృందం గురువారం అసెంబ్లీ, మండ లి సమావేశ మందిరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించింది. భౌతికదూరం, సీటింగ్‌పై పలు సూచనలు చేసింది. 119 మంది సభ్యులు గల అసెంబ్లీలో 151 స్థానాలు ఉన్నాయి. భౌతికదూరం నిబంధన నేపథ్యంలో అదనంగా మరో 42 సీట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అంచనాకు అధికారులు వచ్చారు. గతంలో ఒక్కో సీటుకు ఇద్దరు సభ్యులు కూర్చోగా ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో సీటును ఒక్కో సభ్యుడికి కేటాయిస్తా రు. 40 మంది సభ్యులున్న మండలిలో ప్రస్తుతం 36 మంది ఉన్నారు. ఇందులో 80 సీట్లు ఉండటంతో ఏర్పాట్లకు ఇబ్బంది లేదని అసెంబ్లీ వర్గాలు వెల్లడించా యి. విజిటర్స్, ప్రెస్ గ్యాలరీని మీడియాకు కేటాయించే అవకాశం ఉంది. సీట్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చాక ఎందరిని అనుమతించాలనే విషయంపై మీడియా అడ్వైజరీ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. -
సెప్టెంబర్ 1నుంచి ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కాలేజీల్లో తరగతులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నెల రోజులు ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరే పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే ల్యాటరల్ ఎంట్రీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ తదితర పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను కరోనా కారణంగా కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం తాజా షెడ్యూల్‌ను కేంద్ర మంత్రి జారీ చేశారు. జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని, తేదీని తర్వాత ప్రకటిస్తామని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీటీఈ సాంకేతిక విద్యా కాలేజీల గుర్తింపు, యూనివర్సిటీలు ఇవ్వాల్సిన అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు), కౌన్సెలింగ్ నిర్వహణ, తరతగతుల ప్రారంభానికి సంబంధించిన పూర్తి వివరాలతో షెడ్యూల్‌ను జారీ చేసింది. చదవండి: జూలై 26న నీట్ అప్రూవల్స్ డౌన్లోడ్ చేసుకోండి.. కోర్సుల్లో ఎలాంటి మార్పులు లేకుండా అప్రూవల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం మేరకు ఏప్రిల్ 30న అనుమతులు జారీ చేసినట్లు ఏఐసీటీఈ మెంబర్ కన్వీనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఆయా యాజమాన్యాలు తమ వెబ్సైట్ నుంచి అప్రూవల్ లేఖలను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. కమిటీ నిర్ణయం మేరకు ఈ తాజా షెడ్యూల్‌ను జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్త కోర్సులకు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అప్రూవల్స్ ఇచ్చేందుకు జూన్ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు వెల్లడించింది. యాజమాన్యాలు ఆన్లైన్ మీటింగ్, ఆన్లైన్ స్క్రూటినీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మైక్రో సాఫ్ట్ టీం సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. మేనేజ్మెంట్ కోర్సులకు వేరుగా.. మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రం ఏఐసీటీఈ వేరుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం), పీజీసీఎం కోర్సులకు మాత్రం ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని.. 2021 జూలై 31 వరకు విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలని పేర్కొంది. పాత విద్యార్థులకు జూలై 1 నుంచే ప్రారంభించాలని తెలిపింది. ఈ కోర్సుల ప్రవేశాలను ప్రతి ఏటా జూన్ 30కే పూర్తి చేయాల్సి ఉన్నా ఈసారి మాత్రం జూలై 31 వరకు గడువు ఇచ్చింది. సాంకేతిక విద్యా సంస్థలకు యూజీసీ మార్గదర్శకాలే.. యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా సంస్థలకు అవే మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఫైనల్ సెమిస్టర్, ఇతర సెమిస్టర్ విద్యార్థుల పరీక్షల విషయంలో వాటి ప్రకారమే ముందుకు సాగాలని సూచించింది. ఈ మేరకు ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో డిటెన్షన్‌ను ఎత్తేసి, ఆయా విద్యార్థులను పైసెమిస్టర్‌కు ప్రమోట్ చేయనున్నారు. ఈసారి ఫెయిల్ అనేది.. నిర్ణీత 50 శాతం సబ్జెక్టులు పాస్ కాకుండా అదే సెమిస్టర్లో ఆగిపోవడం అనేది ఉండదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు ప్రమోషన్ ఇవ్వనున్నారు. అయితే వారికి జూలై 15 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించాలని, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు జూలై 1 నుంచి 15లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వీటి అమలుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహనాలు కొంటే..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు సెప్టెంబరు 1 న లేదా తర్వాత విక్రయించిన వాహనాలపై దీర్ఘకాలిక థర్డ్ పార్టీ భీమా వర్తించనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అన్నిబీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా బీమా సంస్థలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఇప్పుడు కార్ల కోసం మూడు సంవత్సరాల బీమా, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల బీమాను ఆఫర్ చేయాలి. అలాగే కొత్త కారు, లేదా బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్ వాహన కొనుగోలుదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కింద కొత్త కార్ల కోసం రూ. 24వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మోటార్ సైకిల్స్ కొనుగోలు చేసినవారు 13వేల రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. వాహన్ మోడల్, ఇంజీన్ కెపాసిటీ ఆధారంగా బీమాను నిర్ణయిస్తారు. జూలై 20,2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. ఇంతకుముందు ఇది ఒక్క సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విధానం ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2018 నుంచి మార్చి 31,2019 వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. దీని ప్రకారం వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే మొత్తం మూడేళ్లకుగానీ ఐదేళ్లకుగానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రద్దు చేసి...కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లవివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ కార్లకు: మూడేళ్ల ప్రీమియం 1000సీసీ మించకుండా ఉండే వాహనానికి రూ.5,286/- 1000సీసీ నుంచి 1500సీసీ మధ్య ఉండే వాహనానికి : రూ.9,534 1500 సీసీకి మించితే : రూ. 24,305 టూ వీలర్స్ : ఐదేళ్ల ప్రీమియం 75 సీసీ లోపు : రూ.1,045 75సీసీ నుంచి 150 సీసీ మధ్య : రూ. 3,285 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య: రూ. 5453 350 సీసీకి మించి : రూ.13,034 -
రేపతి నుంచి తెలంగాణ విమోచన యాత్ర
-
1 నుంచి నగదు బదిలీ పథకం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:జిల్లాలోని గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. వంద శాతం వినియోగదారులు నగదు బదిలీ పథకంలో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం బ్యాంకర్లు, ఎల్పీజీ గ్యాస్ డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో ఏడు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు చేశారని, రెండవ దశలో ప్రకాశం జిల్లాను ఎంపిక చేసినట్లు వివరించారు. గ్యాస్ వినియోగదారులంతా నగదు బదిలీ పథకంలో చేరే విధంగా బ్యాంకర్లు, ఎల్పీజీ డీలర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 5 లక్షల 63 వేల మంది గ్యాస్ వినియోగదారులున్నారన్నారు. వీరందరినీ నూరుశాతం నగదు బదిలీ పథకంలో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 33 లక్షల 92 వేల మందిని ఆధార్ కార్డులో నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 32 లక్షల 78 వేల మంది వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి మండల కేంద్రాల్లో ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. మూడునెలల్లోపు నగదు బదిలీ పథకం ప్రక్రియ పూర్తి కావాలన్నారు. వినియోగదారులకు ఏటా సబ్సిడీపై తొమ్మిది సిలిండర్లు అందిస్తుందని, ఆ తరువాత తీసుకునే వాటికి రూ. 950 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి గ్యాస్ వినియోగదారుడు నగదు బదిలీలో వచ్చేలా చూడాలని ఆదేశించారు. నగదు బదిలీ పథకం గురించి విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. గ్రామాల్లో దండోరా ద్వారా ప్రచారంచేసి ప్రజలు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, నెల్లూరు సిండికేట్ బ్యాంకు డీజీఎం కే శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎల్డీఎం ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రంగాకుమారి తదితరులు పాల్గొన్నారు.