మనిషి ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే సరైన పోషకాలు అవసరం. కుల, మత, లింగ, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి శిశువుల నుంచి వృద్ధుల దాకా పోషకాహారం చాలా కీలకం. పోష కాహారంపై శ్రద్ధ పెట్టకపోతే జీవితం అతలాకుతలమవుతుంది. అనేక వ్యాధులకు మూలంగా మారి పోతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి, శరీరానికి పోషకాహారం ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాన్ని పాటిస్తారు. సెప్టెంబరు 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని నిర్వహిస్తారు.
1982లో కేంద్రం (ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్) ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. పోషకాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ వార్షిక కార్యక్రమం భాగంగా పోషకాహార లోపాన్ని గుర్తించడం, పరిష్కరించడం. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో , వ్యాధులను నివారించడంలో సమతుల్య ఆహారం కీలక పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.
ముఖ్యమైన పోషకాలు
విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ శరీరానికి కావల్సిన పోషకాలు. ముఖ్యంగా పిలల్లో ఈ పోషకాల ప్రాముఖ్యత పాత్ర చాలా ఉంది. వారి మానసిక,శారీరక ఎదుగుదలకు వికాసానికి, ఎముకల బలానికి చాలా అవసరం., పోషకాహారం లోపంతో శారీరక బలహీనత ఏర్పడి, అనేక రోగాలు కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వైరస్‌ల దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది.
పోషకాహారం అంటే?
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఫైబర్‌ల మిశ్రమాలతో సంపూర్ణ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో సహజంగా లభించే వివిధ రకాల తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, మొలకెత్తిన గింజలు, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకుండా ప్రొటీన్ ఫుడ్‌పై శ్రద్ధపెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. చక్కెర, ఉప్పు వాడకాన్ని నియంత్రించాలి. కూల్ డ్రింక్‌లు, అనారోగ్య కరమైన కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలను పరిమితం చేసుకోవాలి. హెర్బల్ టీలను ఎంచుకోవడం బెటర్.
Comments
Please login to add a commentAdd a comment