నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు
నేచురల్ స్టార్ నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకొని జోరు మీద ఉన్న ఈ యంగ్ హీరో అదే ఊపులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాను ప్రారంభించిన నాని, మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తన పుట్టిన రోజు సందర్భంగా నాలుగు సినిమాలకు సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్మెంట్స్ ఇచ్చేశారు. మరోసారి దిల్ రాజు నిర్మాణంలో నటించేందుకు అంగీకరించాడు. 'ఎంసీఏ' అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు.
వీటితో పాటు తనకు కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి బిగ్ హిట్ అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో వరుస సక్సెస్లు సాధించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూడో సినిమాలో కూడా నానినే హీరోగా నటించనున్నాడు. జెట్ స్పీడుతో సినిమాలను పూర్తి చేస్తున్న నాని ఈ నాలుగు సినిమాలను రెండేళ్ల లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.