నానీ హీరోగా నటించిన ఎంసీఏ సినిమా ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తోంది. ఈ గురువారం టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సాయి చరణ్ అనే వ్యక్తి ఫేస్ బుక్‌లో పెట్టాడు. సినిమాను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో కలెక్షన్లపై భారీ ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఈ సంఘటనపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది. కాగా సినిమా రిలీజ్ కు ముందే పైరసీ జరిగిందంటూ వార్తలు రావటంతో నిర్మాత దిల్ రాజు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు.
మరోవైపు శాండిల్‌వుడ్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన అంజనీపుత్ర సినిమా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలో శుక్రవారం ఓ అభిమాని ఆ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌లో చూపడంపై చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. ఈ విషయంపై చిత్ర నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. ఏకంగా సినిమాను గంటకుపైగా ఎఫ్‌బీలో లైవ్‌లో పెట్టాడు. ఈ విషయంపై ఎఫ్‌బీలో సినిమాను లైవ్‌లో పెట్టిన యలహంకు చెందిన నితీష్ మాట్లాడుతూ... తన స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన మాట వాస్తవేమనని, సినిమా లైవ్‌లో పెట్టింది తాను కాదని, తన పేరుతో ఎఫ్‌బీ అకౌంట్‌ను వాడుతున్న తన మిత్రుడని అన్నాడు. తనను క్షమించమని ఈ సందర్భంగా నితీష్ కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment