ముంబైకి నిన్ను కోరి! | Hindi remake of Ninnu Kori on cards, Varun Dhawan to play Nani | Sakshi
Sakshi News home page

ముంబైకి నిన్ను కోరి!

Published Thu, Sep 7 2017 12:14 AM | Last Updated on Tue, Sep 19 2017 12:17 PM

ముంబైకి నిన్ను కోరి!

ముంబైకి నిన్ను కోరి!

‘‘... కానీ నేను అలా కాదుగా బ్రదర్‌... తననే ప్రేమించాను.. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను’’.. ఈ డైలాగ్‌ ‘నిన్ను కోరి’ సినిమాలో నాని చెప్పిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో శివనిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్టయింది. ఇప్పుడు ఇలాంటి డైలాగ్స్‌నే బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ హిందీలో చెప్పబోతున్నారట.

‘నిన్ను కోరి’ హిందీ రీమేక్‌లో ఆయనే హీరోగా నటించనున్నారని సమాచారం. రీమేక్‌ విషయమై తెలుగు వెర్షన్‌ నిర్మాతలు కోన వెంకట్, డీవీవీ దానయ్యలతో బాలీవుడ్‌ దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ చర్చలు జరుపుతున్నారట. నాని చేసిన ఉమ పాత్రకు వరుణ్‌ ధావన్‌ సూట్‌ అవుతారని భన్సాలీ భావించారట. ఇక్కడ కథానాయికగా నివేదా థామస్, హీరోలాంటి రోల్‌ను ఆది పినిశెట్టి చేశారు. మరి.. ఈ రెండు పాత్రలకు హిందీలో ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement