ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న వరుణ్, మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడు. మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన ఈ యువ నటుడు ముందు లవర్ బాయ్ గా ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వరుసగా రొమాటింక్ ఎంటర్‌టైనర్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అదే బాటలో యువ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమాకు అంగీకరించాడు.
నాని హీరోగా నిన్నుకోరి లాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరిని తెరకెక్కించిన శివ నిర్వాణ వరుణ్‌తో తెరకెక్కించబోయే సినిమాలో మాత్రం కాస్తం ఎంటర్‌టైన్మెంట్ కూడా జోడిస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను డీవీవీ దానయ్య నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న వరుణ్, సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయిన తరువాతే కొత్త సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment