మనసు కోరి... | nani"s 'ninnu kori' is released on 7th July | Sakshi
Sakshi News home page

మనసు కోరి...

Published Sun, Jun 4 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

మనసు కోరి...

మనసు కోరి...

అతడి ప్రతి ఊహలో... ఊసులో... వెతికితే గుండె లోతుల్లో ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆమెతో అతడిది స్నేహమా? ప్రేమా? అమ్మాయి దూరమైతే అతడి మనసు ఏం కోరింది? ఈ ప్రశ్నలకు సమాధానాలను జూలై 7న విడుదలయ్యే ‘నిన్ను కోరి’ చూసి తెలుసుకోమంటున్నారు నాని. ఆయన హీరోగా శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

డీవీవీ దానయ్య మాట్లాడుతూ – ‘‘నానితో పాటు హీరోయిన్‌ నివేదా థామస్, కీలక పాత్రధారి ఆది పినిశెట్టి పాత్రలు సినిమాకు మెయిన్‌ పిల్లర్స్‌. ఓ ఇంట్రెస్టింగ్, సెన్సిబుల్‌ పాయింట్‌తో కొత్త దర్శకుడు శివ నిర్వాణ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘అడిగా అడిగా..’ ప్రమోషనల్‌ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 9న టీజర్‌ను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే–మాటలు: కోన వెంకట్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీజో, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement