బాలీవుడ్లో నాని సినిమా..! | Sanjay Leela Bhansali to remake Nani Ninnu Kori | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లో నాని సినిమా..!

Published Wed, Sep 6 2017 11:35 AM | Last Updated on Tue, Sep 19 2017 12:54 PM

బాలీవుడ్లో నాని సినిమా..!

బాలీవుడ్లో నాని సినిమా..!

నాని , ఆది, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ నిన్నుకోరి. డి.వి.వి దానయ్య , కోన వెంకట్ సంయుక్తగా నిర్మించిన ఈ సినిమా జులై 07 తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకునలు ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్నాలీ నిన్ను కోరి సినిమాను రీమేక్ చేయ్యాలని డిసైడ్ అయ్యాడట.

అయితే కథ మీద ఉన్న నమ్మకంతో తెలుగులో నిర్మించిన డివివి దానయ్య, కోన వెంకట్ లు బాలీవుడ్ చిత్రానికి కూడా భాగస్వాములుగా ఉంటామని చెప్పారు. అందుకు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఓకె చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరో వరుణ్ ధావన్ అయిన నాని పాత్రకు సూట్ అవుతాడని సంజయ్ భావిస్తున్నాడు. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement