నిన్నుకోరి బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ | Nani Ninnu Kori Block Buster Celebrations | Sakshi
Sakshi News home page

నిన్నుకోరి బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌

Published Sat, Jul 15 2017 10:56 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

Nani Ninnu Kori Block Buster Celebrations

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌  బ్యానర్ లో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి దానయ్య నిర్మించిన చిత్రం నిన్నుకోరి. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ సూపర్‌హిట్‌ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లకు పైగా వసూళ్లు సాదించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ను దాటేసింది. ఓవర్ సీస్లోనూ మిలియన్ డాలర్ల క్లబ్లో చేసి మరోసారి నాని మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసింది.

ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 16 సాయంత్రం 6 గంటలకు విజయవాడ బందర్‌ రోడ్‌లోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిన్నుకోరి బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. ఈ సెలబ్రేషన్స్‌లో హీరో నాని, ఆది పినిశెట్టి, హీరోయిన్ నివేదా థామస్, నిర్మాత దానయ్య, దర్శకుడు శివ నిర్వాణ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement