సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 రియాల్టీ షోకు రోజు రోజుకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. తొలి రోజుల్లో కాస్త అనాసక్తి కనబర్చిన ప్రేక్షకులు ఇటీవల హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆకర్షితులవుతున్నారు. హౌస్‌మెట్స్ మధ్య గొడవలు.. ప్రేమలు.. ఫన్నీ టాస్క్‌లతో షో కాస్త ఎంటర్‌టైనింగా మారింది. దీనికి తోడు వీకెండ్‌లో తనదైన శైలితో హోస్ట్ నాని అలరిస్తున్నాడు. హౌస్‌మెట్స్ మధ్య చోటుచేసుకున్న గొడవలపై కాస్త సిరీయస్‌గానే ఆరా తీస్తున్నాడు. అంతేకాకుండా వస్తూ వస్తూనే ఓపిట్ట కథ చెప్పి చివర్లో అది ఏ కంటెస్టెంట్‌కు వర్తిస్తుందో.. అని తనదైన స్టైల్‌తో పరోక్షంగా తెలియజేస్తున్నాడు.
అయితే తొలి రెండు వారాల్లో సామాన్యులే ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇది బిగ్‌బాస్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతందని ట్రోల్ కూడా చేశారు. అయితే ఈ సారి మాత్రం సెలబ్రిటీ కిరీటి దామరాజు హౌస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నానీ సైతం గతవారమే చెప్పాడు.. అతను కనుక ఎలిమినేషన్ ప్రక్రియలో ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు తిరస్కరించేవారని హెచ్చరించాడు. దీనికి కారణం కౌశల్ పట్ల కిరీటి వ్యవహరించిన తీరే. ఈ ప్రవర్తనతోనే హౌస్‌మెట్స్ అంతా అతన్నీ ఈ వారం నామినేట్ చేశారు. అంతేకాకుండా కౌశల్ హౌస్‌లో ఉన్నాడంటే దానికి కారణం కూడా కిరీటి ప్రవర్తనే. అమ్మాయిలతో కౌశల్ సరిగ్గా ప్రవర్తించడం లేదని ఓ టాస్క్‌లో కిరీటి అతన్ని చిత్ర హింసలు పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రేక్షకుల దృష్టిలో ఒక్కసారిగా కౌశల్ హీరో కాగా.. కిరీటి విలన్ అయ్యాడు. ఇదే కిరీటి ఎలిమినేషన్ కారణం కానుంది. అప్పటి వరకు కాస్త హుషారుగా కనిపించిన కిరీటి ఈ దెబ్బతో ఈ వారం మొత్తం సైలెంట్ అయిపోయాడు. తనపై ప్రేక్షకులకున్న వ్యతిరేకతను పోగట్టుకోలేకపోయాడు. ఇదే అతని ఎలిమినేషన్‌కు కారణం కానుంది. శుక్రవారం ఎపిసోడ్ కెప్టెన్ టాస్క్‌లో కూడా ఆకట్టుకోలేకపోయాడు.
గణేశ్‌కు భారీ మద్దతు
ఇక ప్రతీవారం ఎలిమినేషన్ ప్రక్రియలో సామాన్యులను టార్గెట్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసిన హౌస్‌మెట్స్ మళ్లీ ఈ సారి కూడా కామన్ మ్యాన్ గణేశ్‌నే టార్గెట్ చేశారు. ఇక గణేశ్ హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయి ప్రజల మద్దతుతో హౌస్‌లో కొనసాగుతున్నాడు. ఈ సారీ ఇక అతనికి చాలా మాద్దతు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సామాన్యుడు హౌస్‌లో ఉండాలని ప్రతీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు. దీంతోనే అతను హౌస్‌లో కొనసాగే అవకాశం ఉంది.
ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో సింగర్ గీతా మాధురి, తేజస్వీ, భానుశ్రీలకు సైతం ప్రేక్షకుల మద్దతు లభించనుంది. తేజస్వీ హౌస్‌లో ప్రేక్షకులకు కావాల్సిన మంచి మసాల అందిస్తుండగా.. సింగర్ గీతా మాధురి పెద్దక్క పాత్ర పొషిస్తోంది. ఇక భాను శ్రీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసిరానుంది. ఆమెకు మద్దతుగా ఫేస్‌బుక్‌లో విపరీత ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారం కిరీటి దామరాజు ఎలిమినేషన్ తప్పేట్లేదు. గత సీజన్‌తో బిగ్‌బాస్‌తో ప్రేక్షకాదరణ పొందిన, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన ఫేస్ బుక్‌లో ‘ఈ వారం కిరీటి బిగ్ బాస్2 నుంచీ వెళ్లిపోతాడేమో...అని నా ఫీలింగ్!’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment