బిగ్‌బాస్‌2 : సంజనా అవుట్‌ | Sanjana Anne Eliminated From Bigg Boss House | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌2 : తొలి ఎలిమినేషన్‌లో సంజనా అవుట్‌

Published Mon, Jun 18 2018 8:25 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Sanjana Anne Eliminated From Bigg Boss House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్ సీజన్‌ 2లో తొలి ఎలిమినేషన్‌ జరిగింది. సామాన్యుల కోటాలో ఎంట్రీ ఇచ్చిన సంజన అన్నే ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అ‍య్యారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంజన పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ్యహరించేవారు. ముఖ్యంగా తేజస్వి సంజనాకు  మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. వారం రోజుల పాటు సంజనా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండగా ప్రతిరోజు వివాదాస్పదంగా ఉండేదంటూ ఇంటి సభ్యులు తెలిపారు.

వచ్చిన రోజు నుంచే సంజనా దురుసుగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు సంజనాను తొలి వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు. ఓటింగ్‌లో ప్రేక్షకుల నుంచి కూడా ఓట్లు తక్కువగా రావడంతో హౌస్ నుండి బయటకు వచ్చేశారు. వస్తూ వస్తూ బాబు గోగినేని, తేజస్విల మీద విమర్శలు చేశారు. బాబుగోగినేని బయటకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని చెప్పింది. అది కేవలం తన అభిప్రాయమేనంటూ తెలిపారు. తేజస్వి పక్క వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలని, అందరిని సమానంగా చూస్తే బాగుంటుందని సూచించారు.

ఎలిమినేట్ అయిన కంటెస్టంట్‌ సంజనకు బిగ్‌బాస్.. బిగ్ బాంబ్ ఒకరిపై ప్రయోగించే అవకాశం ఇవ్వగా, బాబు గోగినేనిపై ప్రయోగించింది. దాని ప్రకారం ఈ వారం మొత్తం ఎవరికి మంచి నీళ్లు కావల్సివచ్చినా, బాబు గోగినేని వారికి అందివ్వాలి.  ఎలిమినేట్‌ అయిన సంజన స్థానంలో నందిని రాయ్‌ ఎంట్రీ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement