బిగ్‌బాస్‌: మళ్లీ సామాన్యుడే టార్గెట్‌ | Bigg Boss Housemates Again Target Common Man Ganesh | Sakshi
Sakshi News home page

Jun 26 2018 12:46 AM | Updated on Jul 18 2019 1:45 PM

Bigg Boss Housemates Again Target Common Man Ganesh - Sakshi

కామన్ మ్యాన్‌ గణేశ్‌

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌-2లో మళ్లీ సామాన్యుడే టార్గెట్‌ అయ్యాడు. ఏదైనా జరగొచ్చు.. హౌస్‌లో కామన్‌ మ్యాన్‌ అంటూ ఈ సారి వినూత్నంగా ప్రారంభమైన ఈ రియాల్టీ షోలో ఆ వ్యక్తికే చోటులేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. లక్షల మందికి ఆడిషన్స్‌ నిర్వహించి ఓ ముగ్గురిని హౌస్‌లోకి పంపించిన విషయం తెలిసిందే. రెండు వారాలు తిరక్కముందే ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. నిజానికి వారు ఎలిమినేషన్‌ అయ్యేంత చికాకేమి తెప్పించలేదు. వారి ఎమోషన్లను బయటపెడుతూ.. సెలబ్రిటీలకు తక్కువేమి కాదని నిరూపించారు. ఈ విషయంలో ఇదంతా బిగ్‌బాస్‌ స్క్రిప్టేనని, సెలబ్రిటీలంతా కలిసే ఇలా చేస్తున్నారని ప్రేక్షకులకు అనేక సందేహాలు కలిగాయి. ఎలిమినేషన్‌ ప్రక్రియ అంతా ప్రేక్షకుల నిర్ణయం మేరకే జరుగుతోందని హోస్ట్‌ నాని స్పష్టం చేసినా జనాలు నమ్మే స్థితిలో లేరనడానికి సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్సే నిదర్శనం. రెండో వారం సీరియస్‌గా.. ఫన్నీగా నూతన నాయుడు ఎలిమినేషన్‌తో రసవత్తరంగా ముగిసింది. 

విజయవంతంగా మూడో వారంలో అడుగుపెట్టిన ఈ రియాల్టీషో.. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ నామినేషన్‌ ప్రక్రియలో మళ్లీ అంతా కామన్‌ మ్యాన్‌ గణేశ్‌నే టార్గెట్‌ చేశారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గణేశ్‌ ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతూనే ఉన్నాడు. గత రెండు వారాలు ప్రజల మద్దతుతో హౌస్‌లో ఉండిపోయాడు. అయితే ఈ ఎపిసోడ్‌లో బాబుగోగినేని, తనీష్‌, శ్యామల, దీప్తి సునైనా, తేజస్వినీ, అమిత్‌లు గణేశ్‌ను నామినేట్‌ చేశారు. దీనికి కారణంగా అతను హౌస్‌లో ఉండటానికి ఇబ్బంది పడుతున్నాడని, అతని బాధను చూడలేకపోతున్నామని, ఈ హౌస్‌లో ఈ చిన్నోడి వల్ల కావడం లేదనే కారణాలు తెలిపారు. నిజానికి గణేశ్‌ భయపడుతున్న విషయం వాస్తవమే.. కానీ అతనికి అవకాశం రావడం లేదన్నది కూడా ఇక్కడ గ్రహించాల్సిన విషయం. కిరిటీ తన గొంతు నొక్కే ప్రయత్నం చేశాడని, తనకేం తెలియదని,.. మాట్లాడుకు.. అని అడ్డుకున్నాడని గణేశే ఎలిమినేషన్‌ నామినేట్‌ చేసే సమయంలో చెప్పాడు. దీంతోనే అతను కెమెరాల ముందు వచ్చి ఎదో చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.

బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌ల వ్యూహాలను గణేశ్‌ అర్థం చేసుకోలేకపోతున్నాడనేది వాస్తవం. సెలబ్రిటీలనే బెరకుతో అతను కొంత వెనక్కు తగ్గుతున్నాడు. ఈ విషయంలో గత ఎపిసోడ్‌లోనే నాని సైతం అతనికి బూస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సింగర్‌ గీతామాధురి, కౌశల్‌ విషయంలో వ్యవహరించిన తీరుతో హౌస్‌లో విలన్‌గా మారిన కిరిటీ, గ్రూప్‌ మెయింటేన్‌ చేసిన తేజస్వి, ఆలోచించకుండా మాట్లాడే భాను శ్రీలు సైతం ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు. కెప్టెన్‌గా ఎంపికైన అమిత్‌, హౌస్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన నందిని రాయ్‌లను బిగ్‌బాస్‌ ఈ ఎలిమినేషన్‌ ప్రక్రియ నుంచి మినహాయించారు. ఈ ఎపిసోడ్‌లో కొన్ని ఫన్నీ గేమ్స్‌ జరగగా.. చివర్లో హీరోయిన్‌ నందిని రాయ్‌, భానుశ్రీలు గొడవపడ్డారు. టీ విషయంలో వాగ్వాదం చోటుచేసుకోగా.. పళ్లు రాలుతాయి, మూసుకో అంటూ తీవ్ర పదజాలంతో తిట్టుకున్నారు. ఈ గొడవకు ఎలిమినేషన్‌ ప్రక్రియనే కారణమని తెలుస్తోంది.

ఫన్నీ బిరుదులు..
ఫన్నీ కామెంట్స్‌ కార్డ్స్‌ను ఎంపిక చేసుకోని వాటికి సరిపోయే హౌస్‌ మెట్స్‌ను ఎంపిక చేయమని బిగ్‌ బాస్‌ హౌస్‌మెట్స్‌కు ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా అత్యంత నిర్భమైన వ్యక్తి భాను శ్రీ అని గీతామాధురి సూచించింది. ఆమె ఎవరికి భయపడదని, ఎదొస్తే అదే మాట్లాడుతుందని తెలిపింది. విచిత్రమైన వ్యక్తి తేజస్వీ అని, అప్పుడే కోప్పడి, అప్పుడే కలిసిపోతుందని దీంతో ఆమె వ్యక్తిత్వం అర్థం కావడం లేదని శ్యామల పేర్కొంది. మానిపపులేటర్‌, అపరిశుభ్రమైన వ్యక్తి రోల్‌రైడా అని దీప్తీ, సామ్రాట్‌లు సూచించారు. బిగ్‌బాస్‌ వదిలివేళ్లే వ్యక్తి గణేశ్‌ అని భాను శ్రీ సూచించగా.. అగ్లీగా ప్రవర్తించే వ్యక్తి కిరిటీ అని, అతను మాస్క్‌ వేసుకొని తిరుగుతారని దీప్తీ సునైనా పేర్కొంది. హౌస్‌లో అన్‌ఫెయిర్‌ దీప్తీ అని తేజస్వీ సూచించగా.. తనీష్‌, తేజస్వీ అసభ్యకరమైన వ్యక్తిగా పేర్కొన్నాడు. ఎక్కువ ప్రేమలో పడే వ్యక్తి తనీష్‌ అని కౌశల్‌, అతిపెద్ద తిండిబోతు తను, రోల్‌రైడా అని గణేశ్‌ ఒప్పుకున్నాడు. వెన్నుపోటు పొడిచే వ్యక్తి కౌశల్‌ అని కిరిటీ పేర్కొన్నాడు. హౌస్‌మెట్స్‌ మధ్య గొడవ పెట్టించే వ్యక్తి దీప్తి సునైనా అని బాబుగోగినేని తెలిపాడు.

తేజస్వీ, సామ్రాట్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌..
ఈ ఎపిసోడ్‌లో తేజస్వీ, సామ్రాట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి మధ్య స్నేహంకు మించి ఎదో ఉన్నట్లు అనుమానం కలిగేలా ప్రవర్తించారు. హౌస్‌మెట్స్‌కు దూరంగా గుసగులాడటం.. ఒకరి మీద ఒకరు పడటం, తినిపించుకోవడం చూస్తే ఓ ప్రేమ జంటలా ప్రవర్తించారు. అయితే ఇది గేమ్‌లో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారా? లేక సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఏమైనా ఉందా? అని తెలియాలంటే.. మరన్నీ ఎపిసోడ్స్‌ జరగాల్సిందే. అయితే తేజస్వీ మాత్రం ఓ ప్రణాళికతో హౌస్‌లోకి వచ్చిందన్న విషయం అర్థం అవుతోంది. హౌస్‌లో ఓ సందర్భంలో గణేశ్‌తో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ గేమ్‌ గురించి తన అభిప్రాయాలను గణేశ్‌తో పంచుకుని అతని ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది. అయితే ఈ వ్యాఖ్యలతో ఆమె పక్కా తొలి రోజు నుంచి గేమ్‌ ప్లే చేస్తుందని, అంతా నటిస్తుందనే విషయం అర్థం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement