నీ కోసం పాత్రలు సృష్టిస్తారు : స్టార్ డైరెక్టర్ | Koratala Siva praises Nani and Nivedha Thomas | Sakshi
Sakshi News home page

నీ కోసం పాత్రలు సృష్టిస్తారు : స్టార్ డైరెక్టర్

Published Wed, Jul 12 2017 3:50 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

నీ కోసం పాత్రలు సృష్టిస్తారు : స్టార్ డైరెక్టర్

నీ కోసం పాత్రలు సృష్టిస్తారు : స్టార్ డైరెక్టర్

గత శుక్రవారం రిలీజ్ అయిన నిన్నుకోరి సినిమాపై ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తోంది. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ లు లీడ్ రోల్స్లో తెరకెక్కిన ఈ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరి, సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. రిలీజ్ సమయంలో కేవలం క్లాస్ ఆడియన్స్ను మాత్రమే అలరిస్తుందని భావించినా.. ప్రస్తుతం అన్ని సెంటర్ల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయని సంబరపడిపోతున్నారు చిత్రయూనిట్.

ఇటీవల నాని నటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రశంసలు కురింపించటం తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీ ఈ లిస్ట్ చేరిపోయాడు. వరుస బ్లాక్ బస్టర్లను అందిస్తున్న దర్శకుడు కొరటాల శివ నిన్నుకోరి యూనిట్ను ఆకాశానికి ఎత్తేశాడు. 'నిన్ను కోరి సినిమా చూశాను. మంచి ఎంటర్టైనర్. సినిమాలో ప్రతీ సన్నివేశం ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత డివివి దానయ్య, కోన వెంకట్లకు శుభాకాంక్షలు. నాని నటన సూపర్బ్. కామెడీ, ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. నివేదాథామస్ ఇక నుంచి నీకోసం రచయితలు పాత్రలు సృష్టిస్తారు' అంటూ ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement