
రాజమౌళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడట..!
తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించే స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై
తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించే స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు. నాని హీరోగా కొత్త దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన నిన్ను కోరి సినిమా టీజర్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన జక్కన్న ఈ సినిమాను తొలి రోజు ఫస్ట్ షో చూడాలనుందంటూ కామెంట్ చేశాడు. నాని తన కెరీర్ లోనే టాప్ ఫాంలో ఉన్నాడంటూ కితాబిచ్చాడు రాజమౌళి.
రాజమౌళి ట్వీట్ పై స్పందించిన హీరో నాని..'సార్ నాకు సినిమా సగం హిట్ అయిపోయినట్టే అనిపిస్తుంది.థాంక్యూ సో మచ్.. ఫస్ట్ డే ఫస్ట్ షోలో కలుద్దాం..' అంటూ రిప్లై ఇచ్చాడు. ఈగ సినిమాలో నటించిన దగ్గర నుంచి నాని, రాజమౌళి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాలో కొన్ని సెకన్ల పాటు తెర మీద కనిపించాడు జక్కన్న. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఈగ సీక్వల్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది.
Ninnu Kori trailer has "I want to watch it FDFS" painted all over it. @NameisNani is in top form. https://t.co/HjkABup4iQ
— rajamouli ss (@ssrajamouli) 18 June 2017
Sirrrrrrr .. This felt like half the success is achieved ...Thank you so much