అఫీషియల్‌ : చైతూ ప్రేయసి ఆమే..! | Naga Chaitanya And Siva Nirvana Movie Title Preyasi | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 11:00 AM | Last Updated on Thu, Mar 8 2018 1:39 PM

Naga Chaitanya And Siva Nirvana Movie Title Preyasi - Sakshi

నాగచైతన్య

ఆన్‌ స్క్రీన్‌ బెస్ట్‌ పెయిర్‌ అనిపించుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు రియల్‌ లైఫ్‌లో కూడా బెస్ట్‌ జోడి అనిపించుకున్నాడు. ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట మరోసారి వెండితెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతుంది. నాని హీరోగా నిన్నుకోరి లాంటి క్లాస్‌ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈసినిమాలో నాగచైతన్యకు జోడి సమంత నటిస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ ప్రకటించారు. షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ రెండవ ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేయసి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ.. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement