పెళ‍్లి తరువాత తొలిసారి..! | Naga Chaitanya and Samantha Akkineni to act together soon | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 10 2018 12:57 PM | Last Updated on Sat, Feb 10 2018 3:40 PM

Naga Chaitanya, Samantha - Sakshi

నాగచైతన్య, సమంత

అక్కినేని యువ హీరో నాగచైతన్య, అందాల నటి సమంతలది సక్సెస్‌ఫుల్‌ జోడి అన్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే, మనం లాంటి సినిమాల్లో అలరించిన ఈ జంట నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిన చైతూ, సమంతలు త్వరలో కలిసి నటించేందుకు అంగీకరించారట. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ నాగచైతన్య హీరోగా ఓ సినిమాను చేసేందుకు అంగీకరించాడు.

నిన్నుకోరి సినిమాను నిర్మించిన దానయ్య, కోన వెంకట్‌లే నాగచైతన్య, శివ నిర్వాణ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత అయితే కరెక్ట్‌ అని భావిస్తున్నాడట దర్శకుడు శివ. నాగచైతన్య హీరోగా కావటంతో సమంత కూడా కాదనదన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. ప‍్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement