
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్ లైఫ్ జోడి సమంతతో కలిసి మరో సినిమలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ-సామ్‌లు కలిసి నటిస్తున్నారు. తాజాగా దర్శకుడు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం చైతూ, సమంతలు విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దర్శకుడు మాత్రం హీరో హీరోయిన్లు లేకుండానే షూటింగ్ మొదలెట్టేశాడు. ముందుగా లీడ్ క్యారెక్టర్స్ కనిపించని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారట టీం. హాలీ డే ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక చైసామ్‌లు కూడా ఈ చిత్రయూనిట్‌తో జాయిన్ కానున్నారు. ఈ సినిమాకు మజిలి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment