రెండు పాత్రల్లో మూడో సారి..! | Nani Dual Role Movie In Merlapaka Gandhi Direction | Sakshi
Sakshi News home page

రెండు పాత్రల్లో మూడో సారి..!

Published Wed, Jun 28 2017 11:29 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

రెండు పాత్రల్లో మూడో సారి..!

రెండు పాత్రల్లో మూడో సారి..!

నిన్నటితరం హీరోలు ద్విపాత్రభినయం చేసిన సందర్భాలు ఎక్కువే. అయితే ఈ జనరేషన్ హీరోలు మాత్రం అలాంటి పాత్రలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అయితే ఈ జనరేషన్లో కూడా ఒకరిద్దరు తారలు డ్యుయల్ రోల్లో అలరిస్తున్నారు. ఈ లిస్ట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నాని. వరుస సక్సెస్లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నాని ప్రయోగాలకు కూడా ముందే ఉంటున్నాడు.

తొలిసారిగా జెండాపై కపిరాజు సినిమాలో డ్యుయల్ రోల్లో కనిపించాడు నాని. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్మన్ సినిమా కోసం మరోసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే రిస్క్కు రెడీ అవుతున్నాడు నాని.

త్వరలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. ఈ సినిమాలో మరోసారి డ్యుయల్ రోల్లో నటించేందుకు ఓకె చెప్పాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నిన్నుకోరి, ఎమ్సీఏ సినిమాల తరువాత మేర్లపాక గాంధీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement