
నిన్ను కోరి...
నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నిన్ను కోరి’. శివనిర్వాణ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెల 10 వరకూ అక్కడే చిత్రీకరిస్తారు. నేడు నాని పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
హను రాఘవపూడితో..
గతేడాది హను రాఘవపూడి దర్శకత్వంలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వంటి విజయవంతమైన చిత్రంలో నాని నటించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రం నిర్మించనున్నారు. ‘‘ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలందిస్తారు. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు నిర్మాతలు.