వయసు పెరగలేదు | Akkineni Nagarjuna defies age in these new photos from Devadas | Sakshi
Sakshi News home page

వయసు పెరగలేదు

Published Wed, Aug 29 2018 12:33 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Akkineni Nagarjuna defies age in these new photos from Devadas - Sakshi

ఇక్కడున్న స్టిల్‌ చూశారు కదా! నాగార్జున వయసు తగ్గినట్లుగా అనిపిస్తోంది కదూ. నిజానికి ఈరోజు (ఆగస్ట్‌ 29) ఆయన వయసు పెరిగింది. అయినా పెరిగినట్లు కనిపించడంలేదు. యస్‌.. ఇవాళ నాగ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘దేవదాస్‌’లోని ఆయన కొత్త స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వైజయంతి మూవీస్‌ పతాకంపై శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డాన్‌ ‘దేవ’గా నాగ్, దాస్‌ పాత్రలో నాని నటిస్తున్నారు. ఫొటోలో కౌబాయ్‌ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఎనర్జీతో పాటు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నట్లుగా ఉన్నారు నాగార్జున.  ఈ మధ్య విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో నాగ్‌ సరసన ‘గురు’ ఫేమ్‌ ఆకాంక్షా సింగ్‌ నటిస్తుండగా నాని సరసన రష్మికా మండన్నా నటిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement