
పోస్టర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా నాని సరికొత్తగా వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
నేడు నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు(ఫిబ్రవరి 24) సందర్భంగా ఆయన అభిమానులకు డబుల్ ధమాకా లభించింది. ఇప్పటికే నాని నటిస్తున్న టక్ జగదీష్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌ను ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న మరో సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా నాని సరికొత్తగా వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కోరమీసాలతో ఉన్న హీరోను వెనకనుంచి ఓ అమ్మాయి హత్తుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్‌లో నానిని చూస్తుంటే ఏకంగా భగత్‌సింగ్ గుర్తు వస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం #ShyamSinghaRoy అనే హ్యష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కాగా శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇక నాని కెరీర్‌లోనే ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దీంతో హీరోకు ఈ చిత్రం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాను రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కోల్‌కత్తా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు నాని పోస్టర్‌పై కథా రచయిత కోన వెంకట్ స్పందించారు. ‘తలెత్తుకొని గర్వంగా నుంచున్నది నువ్వు మాత్రమే కాదు.. నిన్ను చూసి, ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా...’ అని ట్వీట్ చేశారు.
చదవండి: నాని గురించి ఆసక్తికర విషయాలు..
పేరు ....
— Nani (@NameisNani) February 24, 2021
శ్యామ్
పూర్తి పేరు... pic.twitter.com/H1GU1o2VaO
One more Jewel in ur Crown 👑!!
— kona venkat (@konavenkat99) February 24, 2021
తలెత్తుకొని గర్వంగా నుంచున్నది నువ్వు మాత్రమే కాదు ..
నిన్ను చూసి, ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా ... #HappyBirthdayNani https://t.co/SQCDrA1omK