![Nani Shyam Singha Roy in Race for Oscar Nominations in 3 Categories - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/18/nani-shyam-singh-roy.jpg.webp?itok=h9DZlJoe)
నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ ఆస్కార్ పోటీకి వెళ్లింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్యామ్ సింగరాయ్ అనే అభ్యుదయ భావాలున్న బెంగాలీ రచయితగా, ఫిల్మ్ మేకర్‌గా రెండు పాత్రల్లో నాని నటన ప్రేక్షకులను మెప్పించింది.
చదవండి: అందాల ఆరబోతలో తప్పేం లేదు: హీరోయిన్
దేవదాసీగా సాయిపల్లవి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్‌కి పోటీ పడుతోంది. పీరియాడిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారతీయ సంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో నామినేషన్ పరిశీలనకు పంపారు. వచ్చే ఏడాది మార్చిలో 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. నామినేషన్ జాబితాని జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. మరి.. ‘శ్యామ్ సింగరాయ్’కి మూడు విభాగాల్లోనూ నామినేషన్ దక్కుతుందా? కాని పక్షంలో ఏదో ఒక విభాగంలో అయినా దక్కించుకుంటుందా? అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment