Nani Shyam Singha Roy Movie Story Goes Viral In Social Media: ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించించిన నాని ‘వి, టక్ జగదీష్’ చిత్రాలు ఓటీటీలో విడుదల అవ్వడం, అవి నిరాశపరచడంతో ఈ సారి శ్యామ్ సింగరాయ్ మూవీతో హిట్ కొట్టాలి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు నాని. ఇటీవల షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్దమైంది. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలై ట్రైలర్ చూసి ఈ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నారు.
చదవండి: చిరు చేతుల మీదుగా అరుణా రెడ్డికి కియా కారు
కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ కథను వివరిస్తూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. సినిమాలపై ఉండే ఇష్టంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వస్తాడు నాని. అప్పటికే షార్ట్ ఫిలిం చేసిన అనుభవం ఉన్న నాని పీరియాడికల్ సినిమా చేయాలని భావించి.. కథ కోసం కోల్‌కతా వెళతాడు. అక్కడ ఒకప్పటి రైటర్ కమ్ జర్నలిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ గురించి నానికి తెలుస్తుంది. అతడి గురించి ఎక్కువగా స్టడీ చేస్తే తరుణంలో ఆ పాత్రలో తనని ఊహించుకుంటాడు నాని.
చదవండి: సెట్‌లో సుకుమార్‌ను ‘నిన్ను తగలేయా’ అని తిట్టుకునే వాడిని: బన్నీ
తనకు ఇష్టమైన శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లీనమైపోయి ఈ కాలంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. కాకపోతే ఇంటర్వెల్ ముందు వరకు దీన్ని రివీల్ చేయకుండా స్క్రీన్ ప్లేతో రాహుల్ మ్యాజిక్ చేశాడని తెలుస్తోంది. చంద్రముఖి సినిమాలో జ్యోతికలా ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని ప్రవర్తన ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో నాని ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ఏం చేశాడనేదే క్లైమాక్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కథ చాలా ఆసక్తికగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment