Hero Nani: Natural Star Shares Latest Video Of Playing With His Son Arjun Ghanta Goes Viral - Sakshi
Sakshi News home page

Nani And His Son Arjun Video: లయన్‌లాగా ఉన్నావ్‌ నాన్న.. నాని కొడుకు క్యూట్ వీడియో వైరల్‌

Published Mon, Dec 20 2021 3:22 PM | Last Updated on Mon, Dec 20 2021 3:43 PM

Hero Nani Shares Latest Video Of Playing With His Son Arjun Ghanta Goes Viral - Sakshi

Hero Nani Son Arjun Ghanta Played With Father And Of Lion:  నేచురల్‌ స్టార్ నాని హీరోగా ఎంత బిజీగా ఉన్న ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. ఈ క్రమంలో తన కుమారుడు అర్జున్‌తో సరదగా ఆడుకుంటున్న ఫొటోలను నాని తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడుతో నాని ఆడుకుంటున్న క్యూట్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. నాని బెడ్‌పై పడుకుని ఉండగా.. అర్జున్‌ తండ్రిపై కుర్చుని మీసంతో ఆడుకుంటున్నాడు.

చదవండి: బేబీ బంప్‌తో స్టార్‌ హీరోయిన్‌.. పట్టేసిన నెటిజన్లు, ఫొటోలు వైరల్‌

తండ్రి(నాని) పెద్ద పెద్ద మీసాలను పట్టుకుని అర్జున్‌ నిమిరుతూ ఉంటే నాని ‘నాపేరు ఎంటో తెలుసా?’ అని కొడుకుని అడుగుతాడు. ఇందుకు అర్జున్‌ తెలుసు అంటూ శ్యామ్‌ సింగరాయ్‌ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత లయన్‌(సింహం) లాగా ఉన్నావు నాన్న. అంటూ మీసాలను నిమిడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ క్యూట్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. తండ్రి కొడుకులు ఇలా సరదాగా ఆడుకోవడం చూసి నాని ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు.

చదవండి: 5 సీజన్ల బిగ్‌బాస్‌ విన్నర్లు, వారి ప్రైజ్‌మనీ, పారితోషికం ఎంతంటే

కాగా నాని తాజా చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో నాని మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో డబుల్‌ రోల్‌లో పోషిస్తున్న నాని ఓ పాత్రలో శ్యామ్‌ సింగరాయ్‌గా పెద్ద మీసంతో సరికొత్తగా అలరించబోతున్నాడు. ఈ మూవీ నానికి జోడిగా సాయి పల్లవి, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement