నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ కూడా తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నాని గతంలో నటించిన వీ, టక్ జగదీశ్‌లు కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నిరాశలో ఉన్న నాని శ్యామ్ సింగరాయ్‌ని థియేటర్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూశాడు.
చదవండి: హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న యంగ్ క్రికెటర్!, ఇదిగో ఫ్రూఫ్
అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చిన శ్యామ్ సింగరాయ్ థియేటర్లోనే విడుదలయ్యేలా కృషి చేశాడు. నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మాత అయినప్పటికి నానినే వెనకుండి అంతా నడిపించినట్టు ప్రచారం జరిగింది. అంతేగాక శ్యామ్ సింగరాయ్ థియేట్రికల్ రిలీజ్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం స్పెషల్ కేర్ తీసుకున్నాడట. నైజాం డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేశాడని టాక్. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు 8 కోట్లకుపైగా వసూళు చేసినట్లు సమాచారం. ఇదంతా బాగానే ఉన్న ఏపీలో మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది. అక్కడ టికెట్ రేట్స్‌తో పాటు ఇంకా చాలా సమస్యలు నాని సినిమాపై ప్రభావం చూపాయి.
చదవండి: న్యూ ఇయర్‌ను భావోద్వేగంతో స్వాగతించిన సామ్, ఇలా సాగాలంటూ పోస్ట్
దానికి తోడు మూవీ విడుదలకు ముందు నాని చేసిన కామెంట్స్ తీవ్ర రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో నాని కామెంట్స్, ఏపీ టికెట్స్ రేట్స్ తక్కువగా ఉండటం శ్యామ్ సింగరాయ్ మూవీని కలెక్షన్స్ పరంగా దెబ్బతీశాయి. అందుకే ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌లో 60 శాతం పారితోషికాన్ని నాని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్‌కి నాని 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా అందులో రూ. 5 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంతవరకు నాని కానీ, మూవీ టీం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment