
Nani Shyam Singha Roy 13 Days Business Shares Details Inside: నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కాస్తా స్లో అయింది. శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ ఆశించినంత రాబట్టేలేకపోయాయి.
చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్..
తెలంగాణలో ఈ మూవీ బాగానే ఆడినా.. ఏపీలో కొన్ని థియేటర్లు మూత పడటంతో అక్కడ కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అక్కడ శ్యామ్ సింగరాయ్ తక్కువే బిజినెస్ చేసిందని చెప్పాలి. అయితే ప్రారంభంలో ఈ మూవీకి ఆశించిన వసూళ్లు రావడంతో శ్యామ్ సింగరాయ్ సేఫ్ జోన్‌కు వచ్చేసింది. ఇప్పటివరకు 24.80 కోట్ల షేర్ వసూలు చేయగా.. రూ. 22.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ
ఇక సినిమా వసూళ్లను ఓ సారి చూద్దాం.
నైజాం : 9.10 కోట్లు
సీడెడ్ : 2.53 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.17 కోట్లు
ఈస్ట్ : 1.00 కోట్లు
వెస్ట్ : 0.88 కోట్లు
గుంటూరు : 1.21 కోట్లు
కృష్ణా : 0.96 కోట్లు
నెల్లూరు : 0.61 కోట్లు
AP-TG 5 డేస్ కలెక్షన్స్: రూ. 18.72 కోట్లు (రూ.31.77 కోట్లు గ్రాస్)
కర్ణాకట+ROI: రూ. 2.86 కోట్లు
ఓవర్సీస్: రూ. 3.54 కోట్లు
టోటల్ 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.25.12 కోట్లు (రూ. 44 కోట్లు గ్రాస్) షేర్ బిజినెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment