
Sai Pallavi Dance Rehearsal Video: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే.. నెమలి ఆడినట్టే ఉంటుంది. అందుకే ఆమె చేసిన సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తాయి. ‘రౌడీ బేబీ’ (మారి 2), ‘మెల్ల మెల్లగ వచ్చిండే’, (ఫిదా), ‘ఏవండోయ్ నాని గారు’ (ఎంసీఏ) పాటలతో పాటు మొన్నటి లవ్‌స్టోరీలోని ‘ఏవో ఏవో కలలే’ వరకు ప్రతి పాటలో తనదైన స్టెప్పులతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మలయాళ కుట్టి.
ఇక ఇటీవల విడుదలైన నాని ‘శ్యామ్ సింగరాయ్’లో దేవదాసీ పాత్ర పోషించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ మూవీలోని ‘ప్రణవాలయ’పాటకు అద్భుతమైన న్యత్యం చేసి ఔరా అనిపించింది. ఆ పాట సిల్వర్ స్క్రీన్‌పైన విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. అయితే ఆ పాట కోసం సాయి పల్లవి చాలా కష్టపడింది.
తాజాగా ఆ పాట రిహార్సల్స్ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ..‘ప్రణవాలయ పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పర్ఫామెన్స్‌ల్లో ఇది ముందుంటుంది.. రూపాలి కంథారియా, కుష్బూ వాకానిలకు ఈ క్రెడిట్స్ దక్కాలి’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment