
ఇంటివాడైన యంగ్ హీరో..!
వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న యంగ్ హీరో నాని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఓ బిడ్డకు తండ్రైన నాని ఇప్పుడు ఇంటివాడవ్వటం ఏంటి అనుకుంటున్నారా..? అదేనండి చాలా కాలంగా సొంతింటికి మారిపోవాలన్న ఆలోచనలో ఉన్న నాని ఇటీవలో గచ్చిబౌలిలోని ఓ కాస్ట్లీ ఏరియాలో పెద్ద విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న నాని త్వరలోనే గృహప్రవేశానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విల్లా ఖరీదు దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిన్ను కోరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాని. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దిల్ రాజ్ బ్యానర్ లో తెరకెక్కనున్న MCA( మిడిల్ క్లాస్ అబ్బాయి) షూటింగ్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.