Khatron Ke Khiladi 12: Kanika Mann Injured During Her Stunts, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Khatron Ke Khiladi 12: రియాలిటీ షోలో బుల్లితెర నటికి గాయాలు

Published Thu, Jun 16 2022 1:53 PM | Last Updated on Mon, Apr 17 2023 11:08 AM

Kanika Mann Injured On The Set Of Khatron Ke Khiladi 12 - Sakshi

రియాలిటీ షోలో బుల్లితెర నటి కనిక మన్‌ గాయాలపాలైంది. ఖత్రోన్‌ కె ఖిలాడీ 12వ సీజన్‌లో పాల్గొన్న ఆమె స్టంట్స్‌ చేస్తూ గాయపడింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఆమె మోచేతి చర్మం కొట్టుకుపోయి రక్తసిక్తమైనట్లు కనిపిస్తోంది. అంతేగాక కాళ్లకు సైతం అక్కడక్కడా గీసుకుపోయినట్లు రక్తపు మరకలున్నాయి. అంత తీవ్రంగా గాయపడ్డా సరే కనికా మాత్రం చిరునవ్వు చెదరనీయకపోవడం గమనార్హం.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను గాయపడ్డ విషయాన్ని ధృవీకరించింది. 'అవును, నాకు దెబ్బలు తగిలాయి. ఇదే విషయాన్ని రోహిత్‌ సర్‌కు కూడా చెప్పాను. దెబ్బలు బాగా తాకడంతో చేతులు, కాళ్లు కదపలేకపోతున్నానని తెలిపాను. దానికాయన ఏమన్నాడంటే ప్రేక్షకులకు నువ్వు గాయపడ్డ విషయం తెలియదు. వాళ్లు నువ్వు స్ట్రాంగ్‌ ప్లేయర్‌ అని భావిస్తున్నారు. నువ్వు షోలోనే ఉండి అదే నిజమని నిరూపించుకో అని చెప్పారు. నేనిప్పుడు అదే చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చింది. 

కాగా రోహిత్‌ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో రుబీనా దిలైక్‌, ఫైజల్‌ షైఖ్‌, జన్నత్‌ జుబైర్‌, మోహిత్‌ మాలిక్, చేతన పాండే, నిశాంత్‌ భట్‌, ప్రతీక్‌ సెహజ్‌పాల్‌, సురభి, శివంగి జోషి సహా తదితరులు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఈ రియాలిటీ షో షూటింగ్‌ జరుపుకుంటోంది. గతంలోనూ ఖత్రోన్‌ కె ఖిలాడీ షోలో పలువురు గాయాలపాలయ్యారు. వారిలో భారతీ సింగ్‌, తేజస్వి ప్రకాశ్‌ ఉన్నారు.

చదవండి: 2 ఏళ్లుగా డేటింగ్‌, ప్రియుడితో ప్రముఖ దర్శకుడి కుమార్తె పెళ్లి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement