Kanika Mann Revealed Reason Behind Why She Blocked Her Father On Social Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Kanika Mann: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి

Published Tue, Jun 21 2022 3:14 PM | Last Updated on Tue, Jun 21 2022 8:00 PM

Kanika Mann: I Blocked My Papa On Social Media After Posting Bikini Photos - Sakshi

బుల్లితెర నటి కనిక మన్‌ ఖత్రోన్‌ కె ఖిలాడీ సెట్స్‌లో గాయపడిన విషయం తెలిసిందే! అయినా సరే విశ్రాంతి తీసుకోకుండా షోలో స్టంట్స్‌ చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'ఖత్రోన్‌ కె ఖిలాడీలో నా ప్రయాణం చాలా సులువుగా సాగుతుందనుకున్నాను. కానీ నా అంచనా తప్పు. శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం కన్నా తర్వాత నుంచి స్టంట్స్‌ సరిగా చేయలేమేమోనన్న భయమే మానసికంగా వేధిస్తుంటుంది. కానీ రోహిత్‌ శెట్టి సర్‌ మమ్మల్ని ఎంకరేజ్‌ చేస్తూ ఉంటారు. 12వ సీజన్‌లో నాతో పాటు పాల్గొన్న అందరూ వారి బెస్ట్‌ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్కరూ స్టంట్‌ చేయడానికి భయపడి వెనకడుగు వేయలేదు.

ఈ షోలో నేను భాగమవుతాననుకోలేదు. ఎందుకంటే అప్పుడు రూహనియత్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. చివరి నిమిషంలో ఖత్రోన్‌ కె ఖిలాడీ ప్రాజెక్ట్‌కు సైన్‌ చేశాను. ఈ మధ్యే స్టంట్స్‌ చేస్తూ గాయపడ్డాను. షూటింగ్‌ చేస్తున్నంతసేపు ఆ నొప్పి తెలియలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చేతులు, కాళ్లు కదపలేకపోయాను. ఇక ఈ షోలో నేను చేసిన ఫస్ట్‌ స్టంట్‌లోనే గెలిచేశాను. చాలా సంతోషమేసింది. కానీ తర్వాత నా మెడపై అలర్జీ రావడంతో నాన్న చూసి కోప్పడ్డాడు. నా క్షేమమే ముఖ్యమని వెనక్కు వచ్చేయమన్నాడు. ఇప్పుడిప్పుడే ఈ షో గురించి అర్థం చేసుకుంటున్నాడు.

ఇకపోతే ఈ షో వాళ్లు మమ్మల్ని బికినీ కూడా వేసుకోమని చెప్పేవాళ్లు. కేవలం స్టంట్స్‌ మాత్రమే కాకుండా, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు. అందుకని నేను కూడా కొన్నిసార్లు బికినీ వేసుకుని, ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాను. అయితే బికినీ ఫొటోలు షేర్‌ చేసేటప్పుడు మాత్రం మా నాన్నను బ్లాక్‌ చేస్తుంటాను. మా సోదరిని మాత్రం బ్లాక్‌ చేయను. కానీ ఆమె చూసేటప్పుడు నాన్న తనదగ్గరికెళ్ల తనకెందుకు ఆ ఫొటోలు కనిపించడం లేదని అమాయకంగా అడిగేవాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది కనిక.

చదవండి: సినిమా రిలీజ్‌కు ముందు తమకు చూపించాలని కోర్టు ఉత్తర్వులు..
ఆ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్‌.. స్పందించిన సమంత, ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement