kanika
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హర ఓం హర’
కనిక, ఆమని, రవిశర్మ, జ్యోతిరెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హర ఓం హర’. షేర్ దర్శకత్వంలో దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మంచి విజయం సాధించాలి. దర్శకుడు షేర్ కెరీర్ ఈ చిత్రంతో మరో స్థాయికి వెళ్లాలి’’ అన్నారు. ‘‘మాది సినిమా కుటుంబం కాకపోవడంతో కెరీర్ స్టార్టింగ్‌లో కష్టాలు పడ్డాను. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర కూడా చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు షేర్. ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్ నాగ్, షేర్ వంటి వారు నటిస్తున్నారు. -
ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ కనిహ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
షాపర్‌టైన్‌మెంట్‌కు స్వాగతం
తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్‌గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్ ‘షాపర్‌టైన్‌మెంట్’ను ఇష్టపడుతున్నారు.వెబ్సైట్లలో వన్‌సైడ్ కమ్యూనికేషన్ ఇష్టపడని వారికి లైవ్ కామర్స్ యాప్‌లు దగ్గరయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్ ఆన్లైన్ షాపర్. రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్‌టైన్‌మెంట్. ‘షాపర్టైన్మెంట్లో షాప్‌కు వెళ్లి సరదాగా షాపింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్‌స్టిక్ నుంచి ఐ షాడోస్ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక. నాసిక్‌లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్–జెడ్, మిలీనియల్స్ రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘షాపర్‌టైన్‌మెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్‌గా కూడా మారింది. చైనీస్ డిజిటల్ మార్కెట్లో పుట్టిన ‘షాపర్‌టైన్‌మెంట్’ (కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్) ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ హల్చల్ చేస్తోంది.చైనాలో ‘షాపర్‌టైన్‌మెంట్’ అనేది పాపులర్ ట్రెండ్‌గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ‘టవ్భావ్’ షాపర్‌టైన్‌మెంట్‌కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం మరో మార్కెటింగ్ ట్రెండ్ కాదు. రిటైల్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్ దౌయిన్, క్లైష్ ‘షాపర్‌టైన్‌మెంట్’ ట్రెండ్ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్‌టైన్‌మెంట్’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం ‘మింత్రా’ లైవ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లాంచ్ చేసింది. 2026 కల్లా ‘షాపర్‌టైన్‌మెంట్’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇ–కామర్స్ ప్రపంచంలో కస్టమర్ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్ (కేరళ) వెబ్సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్‌గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై -
వ్యర్థాల నుంచి అర్థాలు: హీనంగా చూడకు దేన్నీ పనికొచ్చేవేనోయ్ అన్నీ!
వ్యాపారానికి సామాజిక కోణం తోడైతే బాగుంటుంది. అలాంటి వ్యాపారానికి ఆవిష్కరణలు తోడైతే మరీ బాగుంటుంది. ‘లిఫాఫ’ బ్రాండ్‌తో తనదైన ట్రెండ్‌ను సృష్టించింది కనిక అహుజా. ఆమె వ్యాపార సారాంశం... ‘హీనంగా చూడకు దేన్నీ... పనికొచ్చేవేనోయ్ అన్నీ’ ఢిల్లీకి చెందిన కనిక అహుజాకు పర్యావరణ స్పృహ అనేది పాఠ్యపుస్తకాలలో నుంచో, సభలలో నుంచో వచ్చింది కాదు. చెప్పాలంటే ... బాల్యం నుంచి పర్యావరణ విషయాలను వింటూ పెరిగింది. తల్లిదండ్రులు నెలకొల్పిన ‘కన్జర్వ్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పర్యావరణకోణం లో తనకు ఎన్నో విషయాలపై అవగాహన కలిగింది. కర్ణాటకలో ఇంజినీరింగ్ చేసిన తరువాత ఎంబీఏ చేసింది కనిక. ఆ తరువాత ఒక మార్కెట్ రిసెర్చ్ సంస్థలో చేరింది. అంతా బాగానే ఉంది. ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు’ అనే ఆలోచన కొందరిలో వస్తుంది. ‘ఎక్కడో ఒకచోట, ఎక్కడైతేనేం’ అనుకునేవారు అక్కడే ఆగిపోతారు. అక్కడ నుంచి కొత్త ప్రయాణం ప్రారంభించే వారు మాత్రం విజయశిఖరాలకు చేరువవుతారు. మార్కెట్ రిసెర్చ్ సంస్థలో పనిచేస్తున్న కనిక ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు’ అనుకుంది ఒకరోజు. వెంటనే తల్లిదండ్రుల ఆధ్వర్యంలోని స్వచ్ఛందసంస్థలో చేరి పనిచేయడం మొదలుపెట్టింది. అలా పనిచేస్తున్న క్రమంలో తనకు ‘లిఫాఫ’ బ్రాండ్ ఐడియా వచ్చింది. ఎక్కడో ఒకచోట మురికిగా, చెత్తగా కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలపై మన దృష్టి మరలదు. మరి వాటినే అందమైన వస్తువులుగా తయారుచేస్తే? వ్యర్థాలకు ఒక అర్థం దొరుకుతుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది. గొంగళి పురుగులు సీతాకోకచిలుకలై అందంగా ఎగిరే రోజులు వచ్చాయి! పేదలు, అనాథలు.. మొదలైన వారికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా రీసైకిలింగ్ చేయాలో నేర్పించింది. ఈ హ్యాండ్‌మేడ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ పనిని ఆ తర్వాత ఎంతోమంది నేర్చుకున్నారు. గ్లోబల్ వెంచర్ ఫండ్ అశోక నుంచి ఫండింగ్ దొరకడం తన ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అందమైన బ్యాగులు, రకరకాల యాక్సెసరీలు తయారయ్యాయి. ఎంత బాగున్నాయో! ‘మన సంబరం సరే, జనాలు ఏమనుకుంటారో’ అనుకుంది కనిక. అయితే లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ‘లిఫాఫ’ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘వీటిని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారుచేశాం’ అని చెబితే నమ్మిన వారు తక్కువ! ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్యాషన్ వీక్ తమ ఉత్పత్తులకు బ్రేక్ ఇచ్చింది. మన దేశంలోనే కాదు అమెరికా, యూరప్‌లలో కూడా ‘లిఫాఫ’ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ‘ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారుచేశారు’ అనేది సెల్లింగ్ పాయింట్‌గా మారింది. ‘లిఫాఫ ద్వారా ఉపాధి దొరకడంతోపాటు పర్యావరణానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను తెలుసుకోగలిగాను. నేను తెలుసుకున్న విషయాలను వేరే వాళ్లకు చెబుతున్నాను’ అంటుంది ఇరామ్ అలి. ప్లాస్టిక్–టు–ఫ్యాబ్రిక్, జీరో–వేస్ట్ ప్రాడక్షన్ మెథడ్స్, లో–కార్బన్ టెక్ట్స్‌టైల్ రీసైకిలింగ్... మొదలైన పదునైన బాణాలు ‘లిఫాఫ’ అమ్ములపొదిలో ఉన్నాయి. అందుకే లక్ష్యాన్ని చేధించడం సులువు అయింది! ఇక ఇప్పటి వరకు ఈ సంస్థ సుమారు 12 టన్నుల వ్యర్థాల నుంచి వాలెట్లు, బ్యాగులు ఇతర ఉత్పత్తులు తయారయ్యాయి. గతేడాది వరకు కోటి రెవెన్యూ వచ్చింది. చదవండి: West Bengal: ఇబ్బందికరమైన పరిస్థితులలో సీటుకు ఉండే ప్యానిక్ బటన్‌ను నొక్కితే చాలు! -
బికినీ ఫొటోలు పోస్ట్ చేస్తా.. కానీ నాన్నను బ్లాక్ చేస్తా: నటి
బుల్లితెర నటి కనిక మన్ ఖత్రోన్ కె ఖిలాడీ సెట్స్‌లో గాయపడిన విషయం తెలిసిందే! అయినా సరే విశ్రాంతి తీసుకోకుండా షోలో స్టంట్స్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'ఖత్రోన్ కె ఖిలాడీలో నా ప్రయాణం చాలా సులువుగా సాగుతుందనుకున్నాను. కానీ నా అంచనా తప్పు. శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం కన్నా తర్వాత నుంచి స్టంట్స్ సరిగా చేయలేమేమోనన్న భయమే మానసికంగా వేధిస్తుంటుంది. కానీ రోహిత్ శెట్టి సర్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. 12వ సీజన్లో నాతో పాటు పాల్గొన్న అందరూ వారి బెస్ట్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్కరూ స్టంట్ చేయడానికి భయపడి వెనకడుగు వేయలేదు. ఈ షోలో నేను భాగమవుతాననుకోలేదు. ఎందుకంటే అప్పుడు రూహనియత్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. చివరి నిమిషంలో ఖత్రోన్ కె ఖిలాడీ ప్రాజెక్ట్‌కు సైన్ చేశాను. ఈ మధ్యే స్టంట్స్ చేస్తూ గాయపడ్డాను. షూటింగ్ చేస్తున్నంతసేపు ఆ నొప్పి తెలియలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చేతులు, కాళ్లు కదపలేకపోయాను. ఇక ఈ షోలో నేను చేసిన ఫస్ట్ స్టంట్లోనే గెలిచేశాను. చాలా సంతోషమేసింది. కానీ తర్వాత నా మెడపై అలర్జీ రావడంతో నాన్న చూసి కోప్పడ్డాడు. నా క్షేమమే ముఖ్యమని వెనక్కు వచ్చేయమన్నాడు. ఇప్పుడిప్పుడే ఈ షో గురించి అర్థం చేసుకుంటున్నాడు. ఇకపోతే ఈ షో వాళ్లు మమ్మల్ని బికినీ కూడా వేసుకోమని చెప్పేవాళ్లు. కేవలం స్టంట్స్ మాత్రమే కాకుండా, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉండేలా బ్యాలెన్స్ చేస్తున్నారు. అందుకని నేను కూడా కొన్నిసార్లు బికినీ వేసుకుని, ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాను. అయితే బికినీ ఫొటోలు షేర్ చేసేటప్పుడు మాత్రం మా నాన్నను బ్లాక్ చేస్తుంటాను. మా సోదరిని మాత్రం బ్లాక్ చేయను. కానీ ఆమె చూసేటప్పుడు నాన్న తనదగ్గరికెళ్ల తనకెందుకు ఆ ఫొటోలు కనిపించడం లేదని అమాయకంగా అడిగేవాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది కనిక. చదవండి: సినిమా రిలీజ్‌కు ముందు తమకు చూపించాలని కోర్టు ఉత్తర్వులు.. ఆ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్.. స్పందించిన సమంత, ట్వీట్ వైరల్ -
హిమాన్షును పెళ్లి చేసుకున్న కనికా ధిల్లాన్
గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్లు కనికా ధిల్లాన్, హిమాన్షు శర్మ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు అతి కొద్ది మందే హాజరైనట్లు తెలుస్తోంది. డిసెంబర్లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట తాజాగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన విషయాన్ని సోమవారం నాడు సోషల్ మీడియా సాక్షిగా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా కనికా భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. 2021లో కొత్త ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ నవ దంపతులకు నటి తాప్సీ, మంచు లక్క్క్ష్మీ సహా పలువురు ప్రముఖులు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: రాఖీ సావంత్ విపరీత చేష్టలు) 'జడ్జిమెంటల్ హై క్యా', 'మన్మర్జియాన్' సినిమాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కనికాకు గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడితో వివాహం జరిగింది. అయితే వారి జీవితంలో మనస్పర్థలు తొంగి చూడటంతో కొంతకాలానికి కనికా, ప్రకాష్ విడిపోయారు. రియల్ లైఫ్‌లో విడిపోయినా రీల్ లైఫ్‌లో మాత్రం కలిసి పని చేసేవారు. అలా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథను అందించారు. దీనికంటే ముందు ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్ చేతులు కాల్చుకున్నారు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇక హిమాన్షు విషయానికి వస్తే.. తను 'వెడ్స్ మను', 'రాణీజానా', 'జీరో' చిత్రాలకు కథ అందించిన ఆయన నటి స్వరభాస్కర్‌తో కొంత కాలం ప్రేమాయణం నడిపారు. అయితే ఇద్దరు దారులు వేరని తెలుసుకుని ఆ బంధానికి ముగింపు పలికారు. (చదవండి: హిమాంశు, నేనూ విడిపోయాం: స్వరభాస్కర్) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) -
రాకెట్‌ని నిలబెట్టిన మన అమ్మాయి
భూమి నుంచి 408 కి.మీ. ఎత్తులో ఆకాశంలో అంతరిక్ష కేంద్రం ఉంది. అది ఆమెరికా వాళ్లది. రష్యా వాళ్లది. జపాన్ వాళ్లది, ఐరోపా వాళ్లది. కెనడా వాళ్లది. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు నిరంతరం పైన ప్రయోగాలు జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఆ కేంద్రంలో ఏడుగురు అంతరిక్ష పరిశోధకులు ఉన్నారు.. నాసా నుంచి ఈ ఆదివారం వెళ్లిన డో హర్లీ, బాబ్ బెన్కెన్ లను కూడా కలుపుకుని. అయితే ఆ ఇద్దరిని ‘నాసా’ గానీ, మిగతా నాలుగు అంతరిక్ష సంస్థలు గానీ పైకి పంపలేదు. ‘స్పేస్ ఎక్స్’ అనే ఒక అమెరికన్ ప్రైవేటు సంస్థ పంపింది! అంతరిక్షయాన చరిత్రలోనే ఒక ప్రైవేటు సంస్థ ఇలా రోదసీలోకి మనుషుల్ని పంపడం ఇదే మొదటిసారి. వాళ్లను ‘క్రూ డ్రాగన్’ అనే వ్యోమనౌకలో పైన వదిలిపెట్టిన ‘ఫాల్కన్ 9’ రాకెట్ వెంటనే భూమి మీదికి తిరిగి వచ్చేసింది కూడా! టు అండ్ ఫ్రో.. రాకెట్ ప్రయాణం సక్సెస్. ఆ సక్సెస్‌లో కణిక అనే 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని వాటా కూడా ఉంది! కణిక లక్నో అమ్మాయి. ప్రస్తుతం బోస్టన్లోని ఎం.ఐ.టి.లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. 2018లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ‘స్పేస్ ఎక్స్’ లో ఇంటెర్న్‌గా పని చేసింది. భూమిపై నుంచి లేచేందుకు, తిరిగి భూమి మీద దిగేందుకు ఫాల్కన్ 9కు బలమైన కుదురు కాళ్లను (ల్యాండింగ్ లెగ్స్) డిజైన్ చేసిన ఆనాటì స్పేస్ ఎక్స్ బృందంలోని ఎనిమిది మందిలో కణికా గఖర్ కీలక సభ్యురాలు!(చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్) లక్నోలోని ఇందిరానగర్‌లో 86 ఏళ్ల వయసున్న కణిక బామ్మగారు రాజకుమారి ఇప్పుడు కణిక ఇండియా రాక కోసం చూస్తున్నారు. ‘ఆ రాకెట్‌ను డిజైన్ చేసింది నా మనుమరాలే’ అని ఇప్పటికే ఆ బామ్మ గారు తన ఆనందాన్ని తెలిసిన వారందరితోనూ పంచుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు. ‘స్పేస్ ఎక్స్’ తక్కువ సంస్థేమీ కాదు. ‘నాసా’కు యంగర్ వెర్షన్. అందులోనే మూడు నెలలు ఇంటెర్న్‌గా చేశారు కణిక. ఫాల్కన్ 9 ల్యాండింగ్ లెగ్స్ డిజైనింగ్‌లో ప్రధానమైన బాధ్యతలు ఆమెకే అప్పగించారు. మూడుసార్లు దరఖాస్తు చేసి, మూడుసార్లు ఇంటర్వ్యూకు వెళితేగానీ సాధించలేకపోయిన ఇంటెర్న్షిప్ అది. అందుకే పెద్ద బాధ్యత అని భయపడలేదు కణిక. టీమ్‌లో సీనియర్స్ ఉన్నారన్న తడబాటు లేకుండా టీమ్‌ని నడిపించారు. ఇంటెర్న్‌గా ఉన్నప్పుడు ‘స్పేస్ ఎక్స్’ యజమాని ఎలాన్ మస్క్‌తో, ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు డో హర్లీ, బాబ్ బెన్కెన్తో కూడా ఫాల్కన్ 9 డిజైనింగ్‌లోని మార్పు చేర్పుల గురించి తరచు మాట్లాడేవారు కణిక. ‘‘వాళ్లిచ్చే మోటివేషన్ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో చెప్పలేను’’ అని ఎం.ఐ.టి.లోని సహ విద్యార్థులతో అంటుంటారు కణిక. ఈ ఏడాది ఆగస్టులో ఆమె చదువు అయిపోతుంది. వెంటనే ఉద్యోగం. ఎక్కడో కాదు. తనకెంతో నచ్చిన ‘స్పేస్ఎక్స్’లోనే! పిల్లలందరికీ ఎగరాలనే ఆశ ఉంటుంది. కణిక కూడా ఐదేళ్లకే ఆకాశం వైపు చెయ్యి చూపించింది. ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని ప్రతి తల్లీ తండ్రి అడిగినట్లే నాన్న సందీప్, అమ్మ సిమీ అడిగినప్పుడు ‘రాకెట్లో రయ్‌న ఎగిరిపోతా’ అంది కణిక. అదిప్పుడు ఇంకోలా నెరవేరింది. రాకెట్‌ను రయ్‌న ఎగరనిస్తోంది! కణిMý, కణిక అక్క (ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో డాక్టర్) యు.ఎస్. చదువుల కోసం తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హ్యూస్టన్ వచ్చేశారు. పదవ తరగతి వరకు బెంగళూరులోనే చదివారు కణిక. తర్వాత సింగపూర్‌లో ఐ.బి.స్కూల్లో చేరారు. టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. కణిక బామ్మగారు పెద్దగా చదువుకోలేదు. అయితే చదువు ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో మనవరాలు ఎప్పటికప్పుడు తనకు పంపే వీడియోలలో చూస్తుంటారు. ‘‘ఆ చిన్న పిల్ల ఇంత పెద్దదయిందా..’ అని.. ఆకాశంలో ఎప్పుడైనా కనిపించే పెద్ద నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోయే చిన్నపిల్లలా.. బుగ్గలు నొక్కుకుంటుంటారు బామ్మగారు. ఇప్పుడా పెద్ద నక్షత్రం బుగ్గలు పుణకడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్పేస్ ఎక్స్.. ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ అనేది అమెరికాలోని ప్రఖ్యాత ప్రైవేటు అంతరిక్షయాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ. కాలిఫోర్నియాలోని హాథోర్న్‌లో ఉంది. ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్. ఏరోస్పేస్ టెక్నాలజీ అంతా ఇందులో అందుబాటులో ఉంటుంది. స్పేస్ ఎక్స్ వ్యోమనౌకల్ని తయారు చేస్తుంది. అంతరిక్షయానానికి ఏర్పాట్లు చేస్తుంది. అంగారకుడిలో మానవుల కోసం ఒక కాలనీ నిర్మించేందుకు, అక్కడికి భూగోళం నుంచి మనుషుల్ని తీసుకెళ్లేందుకు ఏళ్లుగా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తోంది. ‘నాసా’ వంటి సంస్థే తన వ్యోమగాముల్ని రోదసీలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సహకారం తీసుకుందంటే ఎలాన్ మస్క్ ఏ స్థాయి అంతరిక్ష పారిశ్రామికవేత్తో స్పష్టం అవుతోంది. 48 ఏళ్ల ఎలాన్ మస్క్ పద్దెనిమిదేళ్ల క్రితం ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంటే తన ముప్పై ఏళ్ల వయసులో! అతడికి మూడు దేశాల పౌరసత్వం ఉంది. (దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా). టెస్లా కార్ల తయారీ కంపెనీ అతడిదే. ఇంకా రాబడినిచ్చే అనేక వాణిజ్య సంస్థలు, వ్యాపకాలు ఉన్నాయి. ఆరుగురు పిల్లలు. మొదటి భార్య రచయిత్రి. రెండో భార్య బ్రిటిష్ నటి. ఇద్దరికీ విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రైమ్స్ అనే కెనడా గాయనితో కలిసి ఉంటున్నాడు. గ్రైమ్స్కి మే 4న మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు అంకెలు, ఆల్ఫాబెట్స్ కలిపి ‘ఎక్స్ యాష్ ఎ ట్వెల్’ అని ఎలాన్ పేరు పెట్టుకున్నాడు. -
రెండు విడాకులు.. ఒక రూమర్!
ఉబుసుకోక ఊహాలకు పనిచెప్పే గాసిప్‌రాయుళ్లు కొందరుంటారు. తలా-తోకాలేని ఊహాలతో కథనాలల్లి.. మీడియాలో పుకార్లకు షికార్లు తొడుగుతారు. తాజాగా ఓ రెండు జంటలు తాము వేరవుతున్నట్టు ప్రకటించాయి. వైవాహిక బంధం నుంచి తప్పుకొని.. పరస్పర సామరస్యంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించాయి. అంతే, రాసిప్రాయుళ్లు తమ చెత్తబుర్రలకు పదును పెట్టారు. ఈ జంటల విడాకులకు మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించి.. ఎఫైర్ కారణంగానే వాళ్లు విడిపోయారంటూ కథనాలు అల్లారు. దీనిపై ఆ జంటలు స్పందించి.. ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాయి. ఇటీవల విడాకులు తీసుకున్న సినీ జంటలు దియా మీర్జా-సాహిల్ సంఘా, ప్రకాశ్ కోవెలముడి-కనికా దిల్హాన్ విషయంలో ఇది జరిగింది. బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ సంఘా నుంచి వేరవుతున్నట్టు ప్రకటించగా.. అదే సమయంలో దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి భార్య, స్క్రీన్‌రైటర్ కనికా దిల్హాన్ తాము విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో దియా-సాహిల్ విడాకులకు కారణం కనికా దిల్హాన్ అని వదంతులకు తెరతీశారు. సాహిల్‌తో కనికకు ఉన్న ఎఫైర్ కారణంగా ఈ రెండు జంటలు వేరయ్యాయి అంటూ కథనాలు సృష్టించారు. దీనిపై దియా మీర్జా స్పందిస్తూ.. ఈ వదంతులకు అసలు అర్థమే లేదని కొట్టిపారేశారు. తాము విడిపోవడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయమే లేదని ఆమె ట్విటర్లో స్పష్టం చేశారు. కనిక కూడా ట్విటర్లో ఈ కథనాలపై స్పందించారు. దియా, సాహిల్‌లను తన జీవితంలో ఏనాడూ కలుసుకోలేదని స్పష్టం చేశారు. ఇది అత్యంత దారుణమైన, జుగుప్సకరమైన వదంతులని, టాబ్లాయిడ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మండిపడ్డారు. ఏకకాలంలో జరిగిన రెండు ఘటనల మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించడం సరికాదని, తాను ఫిక్షన్ రైటర్‌నని, తనను మించిపోయారని గాసిప్రాయుళ్లను ఎద్దేవా చేశారు. సాహిల్ సంఘా కూడా ఈ వదంతులను తీవ్రంగా ఖండించారు. -
మాటలంటే మాకు ఇష్టం
ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గర చేరితే ఏం మాట్లాడుకుంటారు? ‘ఎన్నెన్ని మాట్లాడుకుంటారో!’ అనాలి కదా. వాళ్లిద్దరూ ఒకే దగ్గర పని చేస్తూ ఉంటే? తాప్సీని అడిగి చూస్తే ఏం చెప్తున్నారో తెల్సా – ‘ఇష్టమైన మాటలు’ అని! తాప్సీ, కనిక ధిల్లన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ ఇంకా సూర్యుడు ఉదయించకముందే అమృత్‌సర్‌లోని పచ్చని పొలాల్లో ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తాప్సీ హీరోయిన్గా నటించిన‘మన్ మర్జియాన్’ సినిమాకు కనిక స్క్రీన్‌ప్లే, డైలాగ్ రాశారు. ఆ సమయంలోనే ఇద్దరూ ఇలా ఫ్రెండ్స్ అయిపోయారు. సెప్టెంబర్ 14న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి కానీ, అందులో తాను చేసిన రూమీ పాత్ర గురించి కానీ, ఇంకా కెరీర్‌కు సంబంధించిన ఇంకే విషయంగానీ మాట్లాడుకోవట్లేదట ఇద్దరూ. ‘సాయంత్రం డిన్నర్ ఎక్కడ చేద్దాం’, ‘సాయంత్రం సరే, ముందు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేద్దాం’, ‘అమృత్‌సర్‌లో కుల్చ ఫేమస్ కదా, అది ట్రై చేద్దామా’.. ఇవి.. ఈ ఫొటో తీస్తున్న టైమ్‌కి అచ్చంగా ఈ మాటలు మాట్లాడుకుంటున్నారట తాప్సీ, కనిక. ఫ్రెండ్స్ అంటే మరి అన్నీ మాట్లాడుకుంటారు. సరదావి, సీరియస్‌వి కూడా! అవి ఏవైనా ఇష్టమైన మాటలు అంటున్నారు తాప్సీ. ఈ ఫ్రెండ్స్ ‘మన్ మర్జియాన్’తో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుందాం. -
నిప్పు కనిక
ఆరో క్లాసులో అగ్నిపరీక్ష ఒకటి కనికను, స్నేహితురాళ్లను, కుటుంబాన్ని మసకబార్చింది. స్కూల్లోని ఒక వేడుకలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది! కానీ కనికను ఆ అగ్నిపరీక్షే కాదు. జీవితంలోని ఏ అగ్నిపరీక్షా ఆపలేకపోయింది. బ్రేవ్ గర్ల్. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఎంపికయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరైన కనికా కుమార్ (ఇంకొకరు దీపికా ప్రసాద్) ముంబైలోని ‘ఇంటెల్‌క్యాప్’కి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి హాజరవుతున్న సందర్భంలో కనిక పరిచయమిది.కనికా కుమార్ పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. సెయింట్ ఆన్స్‌లో పాఠశాల విద్య, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కనిక ఆరవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది.అందులో కనికా గాయపడ్డారు. కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. ఆ ప్రభావం ఇప్పటికీ మొహం మీద కనిపిస్తుంటుంది. ‘‘బయటవాళ్లు చాలామంది అడుగుతారు ఏమైంది? అని. చెప్పగానే.. ‘అయ్యో పెళ్లి ఎలా అవుతుందమ్మా?’ అంటూ జాలిపడ్తారు. ఆ మాటలకు మనసులోనే నవ్వుకుంటా. ఎందుకంటే ఇలాంటివి అధిగమించే స్థయిర్యాన్ని నేను ఏనాడో సాధించాను. చిన్నప్పుడు జరిగిన ఆ ప్రమాదం ఒక రకంగా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అని చెప్తుంది కనికా. లండన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కనికా లండన్ వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో డిప్లొమా కోర్స్ చేశారు. తిరిగొచ్చాక ముంబైలోని ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో కొన్నాళ్లు పనిచేశారు. హైదరాబాద్‌లో ‘బాలకళాకార్’ టీమ్‌లో ఆమె ఓ భాగస్వామి. పేదపిల్లల్లో ఉన్న కళలను వెలికితీసి, వాళ్లను ప్రోత్సహిస్తుంటుంది ఈ సంస్థ. ‘‘ఇప్పటి వరకు 3 వేల మంది పిల్లల్లోని క్రియేటివ్ స్కిల్స్‌కు ఒక డయాస్ కల్పించాం. పెయింటింగ్, డాన్స్, సాంగ్స్ వంటి వాటిల్లో వాళ్లను ప్రోత్సహిస్తున్నాం. ఆ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్ కూడా పెట్టాం’ అని చెప్తారు కనిక. ఇంటెల్‌క్యాప్ యాడ్ ఏజెన్సీలో పనిచేశాక ఇంటెల్క్యాప్లో జాయిన్ అయ్యారు కనిక. ప్రస్తుతం అందులోని కార్పొరేట్ స్ట్రాటజీ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సోషల్ ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం కృషిచేస్తున్నారు. బాధ్యతల్లో భాగంగా ఆఫ్రికాలో కొన్నాళ్లున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇనిషీయేటివ్ ప్రోగ్రామ్ అయిన ది గ్లోబల్ షేపర్స్ (ముంబై)లో కూడా ఆమె పాలుపంచుకుంటున్నారు. ప్రయాణాలంటే చాలా ఇష్టపడే కనిక తను చూసిన, పనిచేస్తున్న ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను దగ్గరగా చూశారు. ‘‘వ్యక్తిగతంగా ఇటు ఇంట్లో, అటు బయట నేనెలాంటి వివక్షనూ ఎదుర్కోకపోయినా.. అలాంటి పరిస్థితినైతే చూశాను. నిజానికి మా ఇంట్లో నాకు సంబంధించి.. అంటే చదువు, జాబ్ ఎవ్రీథింగ్ నా ఇష్టమే. ఆఫీస్‌లో కూడా నేనెలాంటి వివక్షకు లోను కాలేదు. మగవాళ్లకు ఎలాంటి అవకాశాలు వచ్చాయో నాకూ అలాంటి అవకాశాలే వచ్చాయి. వాళ్లు డీల్ చేసిన కఠినతరమైన సవాళ్లను నేనూ డీల్ చేశాను. పదోన్నతులను కూడా అంతే సమానంగా పొందాను. కాని నేను బాగుండగానే నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు బాగున్నట్టు కాదు కదా! వివక్షకు గురి అయిన అమ్మాయిలను చాలామందిని చూశాను. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో వాస్తవాలు ఏంటో నాకు తెలుసు. ఆడవాళ్లను చులకనగా చూస్తారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు లోన్స్ కూడా దొరకని స్థితి. ప్రాపర్టీ ఉన్నా ఆమె పేరున ఉండదు. అంతా భర్త అధికారం కిందే, ఆయన అనుమతితోనే సాగాలి. ఈ చాలెంజెస్ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డ వాళ్లను చూశాను. ఇవన్నీ గ్రహించాకే మహిళల కోసం ఏమన్నా చేయాలి అనిపించింది. అందుకే మా సంస్థలో ‘క్రెడిట్ ట్రీ’ ఏర్పాటు చేశాం. ఈ క్రెడిట్ ట్రీ కింద ఒంటరి స్త్రీలకు కూడా లోన్స్ ఇప్పిస్తాం. వ్యాపార, వాణిజ్య రంగాల్లో వాళ్లూ రాణించడానికి హెల్ప్చేస్తున్నాం’ అని వివరించారు కనికా కుమార్. గర్వంగా ఉంది ఇంత చిన్న వయసులో మా అమ్మాయి సాధించిన విజయం చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. పని అంటే ప్యాషన్ ఆమెకు. చేస్తున్న పనిపట్ల నిజాయితీ, నిబద్ధతతో ఉంటుంది. సహాయం, సేవ ఆమె నైజం. తన పనితో సమాజంలో ఒక ఇంపాక్ట్ ఉండాలని తపన పడుతుంది. ఆత్మవిశ్వాసం మెండు. ఇవ్వాళ్టి అమ్మాయిలకు కావల్సింది కూడా అదే. ఫిజికల్ బ్యూటీ కాదు ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. అదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే పిల్లల్లో విశ్వాసం పెంపొందింపచేయాలి. – అనిల్‌కుమార్, సీమా కుమార్ (కనికా కుమార్ తల్లిదండ్రులు) – సరస్వతి రమ -
తమిళ దర్శకులకు పరిపక్వత లేదు
తమిళ దర్శకులకు పరిపక్వత లేదని మలయాళ నటి కనిక విరుచుకుపడ్డారు. పెళ్లరుున తరువాత కూడా అశ్లీలంగా నటించమని అడుగుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ భామ తమిళంలో ఫైవ్ స్టార్, ఆటోగ్రాఫ్, వరలారు తదితర చిత్రాల్లో నటించారు. మలయాళంలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన ఈ అమ్మడు ఆ మధ్య వివాహం చేసుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా వున్నా ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. తమిళంలో కొన్ని అవకాశాలు వచ్చినా అంగీకరించలేని పరిస్థితి అంటున్నారు. దాని గురించి కనిక మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో సంచలన నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశించేదానన్నారు. అయితే ఇప్పుడలాంటి కోరిక లేదన్నారు. పేరు కోసం చిత్రాలు చేయాలనే అవసరం లేదని పేర్కొన్నారు. మంచి వైవిధ్యభరిత పాత్రలు అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నానన్నారు. తన కుటుంబ సభ్యుల ఆదరణ తనకెప్పుడూ ఉంటుందని తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమ విషయానికొస్తే వివాహం అయిన హీరోయిన్లను పక్కన పెట్టేస్తున్నారని తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా పెళ్లరుుందన్న ఆలోచన కూడా లేకుండా అరకొర దుస్తులు ధరించమని అడుగుతున్నారని ఆరోపించారు. చీర ధరించి నటిస్తానంటే వారి నుంచి బదులే లేదని చెప్పారు. అయితే మలయాళంలో అలాంటి పరిస్థితి లేదని అక్కడ వయసు మళ్లిన నటీమణులైనా కథానారుుకగా అవకాశాలిస్తారని తెలిపారు. మలయాళ దర్శకుల్లో పరిపక్వత ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు నటి కనిక.