ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘హర ఓం హర’ | hara om hara title logo launch | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘హర ఓం హర’

Published Sun, Jul 2 2023 6:37 AM | Last Updated on Sun, Jul 2 2023 1:15 PM

hara om hara title logo launch - Sakshi

కనిక, ఆమని, రవిశర్మ, జ్యోతిరెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హర ఓం హర’. షేర్‌ దర్శకత్వంలో దేవేంద్ర మదన్‌ సింగ్‌ నేగి, అశోక్‌ ఖుల్లార్‌ నిర్మించారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను రిలీజ్‌ చేసిన సుమన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మంచి విజయం సాధించాలి. దర్శకుడు షేర్‌ కెరీర్‌ ఈ చిత్రంతో మరో స్థాయికి వెళ్లాలి’’ అన్నారు.

‘‘మాది సినిమా కుటుంబం కాకపోవడంతో కెరీర్‌ స్టార్టింగ్‌లో కష్టాలు పడ్డాను. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర కూడా చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు షేర్‌. ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్‌, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్‌ నాగ్, షేర్ వంటి వారు నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement