తమ్ముడి దుర్మరణం; నటుడి భావోద్వేగం | Prince Narula On Brother Death By Drowning In Canada | Sakshi
Sakshi News home page

‘నా తమ్ముడు ఇకలేడు.. నమ్మలేకపోతున్నా’

Published Tue, Jul 9 2019 10:02 AM | Last Updated on Tue, Jul 9 2019 10:04 AM

Prince Narula On Brother Death By Drowning In Canada - Sakshi

‘రూపేశ్‌ అమెరికాలో సెటిలయ్యాడు. తన పెళ్లై రెండు నెలలు కూడా గడవలేదు. తన వయస్సు 25 ఏళ్లు. ఇంకొన్ని రోజుల్లో తన భార్య కూడా అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ఇంతలోనే తను శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఇంకా నమ్మలేకున్నా’  అని టీవీ నటుడు, నాగిన్‌ 3 సీరియల్‌ ఫేం ప్రిన్స్‌ నరులా భావోద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడి ఆకస్మిక మరణం ఎంతగానో వేదనకు గురిచేస్తోందన్నాడు. ప్రిన్స్‌ సోదరుడు రూపేశ్‌ కెనడాలో  దుర్మరణం చెందాడు. ప్రస్తుతం అతడి శవాన్ని భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

వద్దన్నా వినకుండా..
ఈ క్రమంలో ప్రిన్స్‌ మాట్లాడుతూ.. ‘తను ప్రస్తుతం టొరంటోలో ఉన్నాడు. గత సోమవారం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. నిజానికి తనకు సిమ్మింగ్‌ రాదు. స్నేహితులు వద్దని వారించినా తను వినలేదు. వాళ్లను అక్కడి నుంచి వెళ్లమని చెప్పి నీటిలో దిగాడు. దురదృష్టవశాత్తూ అందులోనే మునిగి చనిపోయాడు. మునిగిపోతున్నా కాపాడండి అన్న తన మాటలు తమకింకా వినిపిస్తున్నాయని తన ఫ్రెండ్స్‌ చెప్పారు. అన్నీ సక్రమంగా ఉంటే రూపేశ్‌ భార్య తన దగ్గరికి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించేది. వీసా రానందున మాతో పాటు ఇక్కడే ఉంది. కానీ ఇంతలో ఇలా జరిగింది. అమ్మానాన్న తన శవాన్ని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక రూపేశ్‌ భార్యను యువికా(ప్రిన్స్‌ భార్య) ఓదారుస్తోంది’  అని స్పాట్‌బాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా ఎంటీవీ రోడీస్‌ 12, ఎంటీవీ స్పాట్‌విల్లా 8, బిగ్‌బాస్‌ 9 తదితర రియాలిటీ షోల విజేతగా ప్రిన్స్‌ నరులా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement