![Actor Suresh Gopi daughter Bhagya hits back at the body shaming comments - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/7/malayalam.jpg.webp?itok=s8f6Y_Vm)
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్స్ కామెంట్లకు అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా సినీ కారలు, వారి కుటుంబసభ్యులు తరచూగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఓ తాజాగా ఓ ప్రముఖ నటుడి కుమార్తె ట్రోలింగ్ గురయ్యారు. ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అసలేం జరిగిందంటే..
మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె భాగ్య ఇటీవలే కెనడాలోని ఓ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకున్న ఫోటోలను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఆమె ఈ ఫోటోల్లో సంప్రదాయ దుస్తులైన చీరలో కనిపించింది.
(ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!)
అయితే ఇది చూసిన ఓ నెటిజన్.. 'కంగ్రాట్స్.. మీరు చీరలు పక్కనపెట్టి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్లకు శారీ సెట్ కాదు. ఫ్యాషన్ దుస్తుల్లోనే మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారు.' అంటూ కామెంట్ చేశాడు.
ముందు నీ పని చూసుకో
అయితే ఇది చూసిన భాగ్య అతనికి కాస్తా గట్టిగానే రిప్లై ఇచ్చింది. మీరిచ్చిన ఉచిత సలహాకు థ్యాంక్స్.. నా బరువుతో మీకేం పనిలేదు. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటా. పట్టా అందుకున్నప్పుడు సంప్రదాయ దుస్తులే ధరించా. అందరిలాగా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నా గురించి కామెంట్ చేయడం మాని.. ముందు మీ పనిపై దృష్టి పెట్టండి.' ఘాటూగానే బదులిచ్చింది. కాగా.. మలయాళ నటుడు సురేశ్ గోపీ తెలుగువారికి సుపరిచితులే. ఆయన పోలీస్ పాత్రలో నటించిన పలు మలయాళీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.
(ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?)
Comments
Please login to add a commentAdd a comment