
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్‌ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.
మమ్ముట్టికి కుటుంబం కుంజన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్‌లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్‌లతో కలిసి పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment