
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కెనడాకు చెందిన నటుడు సెయింట్ వాన్ కోలుచి(22) కన్నుమూశారు. అయితే ముఖానికి సర్జరీ చేయించుకోవడం వల్లే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు దాదాపు 12 రకాల సర్జరీలు చేయించుకున్నారు. ఉదయం దక్షిణ కొరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. సెయింట్ వాన్ కొలూచి 12 ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు 2,20,000 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
గతేడాది నవంబర్‌లో దవడకు అమర్చిన ఇంప్లాంట్‌లను తొలగించుకోవడానికి ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అది ఇన్‌ఫెక్షన్‌కు దారి తీయడంతో కొద్ది గంటలకే మృతి చెందాడు. వాన్ కొలూచి సినీ ఇండస్ట్రీలో రావడానికి 2019లో కెనడా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లినట్లు అతని సన్నిహితులు తెలిపారు. అతను దక్షిణ కొరియా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment