
ప్రముఖ హాలీవుడ్ నటుడు చనిపోయాడు. కెప్టెన్ మార్వెల్, స్టార్ ట్రెక్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కెన్నెత్ మిచెల్(49) ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచాడు. తాజాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఏఎల్ఎస్ (అమియోట్రొఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇతడు.. ఆ వ్యాధితో పోరాడుతూ చనిపోయాడు.
(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)
2000 నుంచి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తున్న కెన్నెత్ మిచెల్.. మిరాకిల్, ఛార్మ్స్ ఫర్ ది ఈజీ లైఫ్, బ్లడ్ హనీ, ఘోస్ట్ విస్పరస్ తదితర చిత్రాల్లో నటించాడు. అలానే పలు వెబ్ సిరీసుల్లో హీరోగా, సహాయ పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ విషయానికొస్తే 2006లో నటి సుసాన్ మే ప్రాట్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
(ఇదీ చదవండి: అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత)