సింగర్‌తో ప్రొడ్యూసర్‌ ఎంగేజ్‌మెంట్‌ | Raghu Ram Gets Engaged To Canadian Singer Natalie Di Luccio | Sakshi
Sakshi News home page

కెనడియన్‌ సింగర్‌తో ప్రొడ్యూసర్‌ ఎంగేజ్‌మెంట్‌

Published Mon, Aug 6 2018 12:26 PM | Last Updated on Mon, Aug 6 2018 1:45 PM

Raghu Ram Gets Engaged To Canadian Singer Natalie Di Luccio - Sakshi

ప్రముఖ రియాలిటీ షోలు రోడీస్‌, స్ల్పిట్స్‌విల్లాల రూపకర్త, ప్రొడ్యూసర్‌ రఘురాం తన గర్ల్‌ఫ్రెండ్‌ నటాలియో డి లూసీతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. టొరంటోలో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి నిశ్చితార్థ వేడుకకు టీవీ నటుడు కరణ్‌వీర్‌ బోహ్రాతో పాటు అతడి భార్య తీజాయ్‌ కూడా హాజరయ్యారు. రఘురాం, నటాలియోతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసిన తీజాయ్‌..‘ మేము ఈ రోజు టొరంటోలో ఉండటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. మాకెంతో ప్రియమైన స్నేహితుల కోసం ఇక్కడికి వచ్చాం. రఘు.. చాలా స్వీట్‌, ఇంటెలిజెంట్‌ పర్సన్‌. అన్ని రకాల సంతోషాలు పొందడానికి నువ్వు మాత్రమే అర్హుడివి. మీ ఇద్దరి(రఘు, నటాలియో)ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. కెనడియన్‌ అమ్మాయిలు ఎప్పుడూ ప్రత్యేకమే కదా’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

ఎమ్‌టీవీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన రఘురాం 2006లో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సుగంధతో విడాకులు తీసుకున్న రఘురాం.. గత కొంత కాలంగా కెనడియన్‌ సింగర్‌ నటాలియోతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement