మీ నట్టింట్లోకి వస్తానంటున్న సన్నీ లియోన్ | Will reach your living rooms through MTV Splitsvilla 9, says Sunny Leone | Sakshi
Sakshi News home page

మీ నట్టింట్లోకి వస్తానంటున్న సన్నీ లియోన్

Published Sat, Jun 4 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

మీ నట్టింట్లోకి వస్తానంటున్న సన్నీ లియోన్

మీ నట్టింట్లోకి వస్తానంటున్న సన్నీ లియోన్

బాలీవుడ్‌కు వచ్చిననాటి నుంచి తీరిక లేకుండా గడుపుతోంది సన్నీ లియోన్‌. ఇటు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలుకరిస్తూనే.. అటు టీవీలోనూ హల్‌చల్‌ చేయడానికి సిద్ధమవుతోంది ఈ హాట్‌ భామ. త్వరలో ఎంటీవీలో ప్రసారం కానున్న 'స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 9' హోస్ట్‌గా, మెంటర్‌గా సన్నీ టీవీ వీక్షకుల ముందుకురానుంది.

ఎంటీవీలో వచ్చే ఈ కార్యక్రమం పట్ల యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. తన రాకతో ఈ షో మరింత ప్రేక్షకాదరణ పొందుతుందని సన్నీ ధీమాగా ఉంది. 'యువతను ఎక్కువగా ఆకర్షించాలని నేను కోరుకునేదానిని. ఎంటీవీ షోలో హోస్ట్‌గా యువత ముందుకు రానుండటం ఎక్సైటింగ్‌గా ఉంది' అని ఆమె తెలిపింది. 'నా వరకు ఈ షో ద్వారా కొత్త మార్కెట్‌కు నేను చేరువ అవుతాను. ఆ మార్కెట్‌ యువత. సినిమాల్లో నేను పోషించే పాత్రల వల్ల ఒక విభిన్నమైన అభిప్రాయం కలుగవచ్చు. కానీ టీవీలో ఈ షో ద్వారా నేను యువతను రిప్రజెంట్‌ చేస్తూ ప్రజల నట్టింట్లోకి వెళ్లే అవకాశం కలుగుతుంది' అని సన్నీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement