కష్టాల్లో మరో ఆప్ నేత! | Complaint Against Ashutosh for 'Comparing' Nehru, Gandhi with sandeep kumar | Sakshi
Sakshi News home page

కష్టాల్లో మరో ఆప్ నేత!

Published Mon, Sep 5 2016 10:34 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

కష్టాల్లో మరో ఆప్ నేత! - Sakshi

కష్టాల్లో మరో ఆప్ నేత!

ముంబయి: మరో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కష్టాల్లో పడే అవకాశం ఉంది. తమ పార్టీ నేతకు మద్దతిచ్చే క్రమంలో జాతీయ నాయకులపై నిందలు వేసినట్లుగా మాట్లాడటమే ఈ పరిస్థతికి కారణమైంది. లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ సీడీ లీకవడమే కాకుండా.. బాధితురాలు కూడా ఫిర్యాదు చేయడంతో ఆప్ బహిష్కృతమంత్రి సందీప్ కుమార్పై కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టు చేసి అనంతరం ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ మాట్లాడుతూ జవహార్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీకి కూడా అక్రమ వ్యవహారాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్ తివారీ అనే వ్యక్తి ఆయనపై ఫిర్యాదు చేశాడు. నెహ్రూ, గాంధీవంటి జాతీయ నాయకులపై ఆరోపణలు చేసి దేశం మొత్తాన్ని అవమానించారని, ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసు నమోదు విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ముంబయిలోని సకానికా స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement