
న్యూఢిల్లీ: జాతిపిత గాంధీజీని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్(87) ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం చాటున గాంధీజీ ప్రతిష్టను మోదీ సర్కారు ‘సీనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్’ స్థాయికి దిగజార్చిందని ఇర్ఫాన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చరిత్రకారులు, కళాకారులు, విద్యార్థులు, వివిధరంగాలవారు పాల్గొన్న కార్యక్రమంలో ఇర్ఫాన్ మాట్లాడారు. గాంధీజీ 150వ జయంతి వార్షికోత్సవాలు ప్రారంభమౌతున్న తరుణంలోనైనా దేశప్రజలు మహోన్నతమైన ఆయనను జాతిపితగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. జాతీయత అంశంపై ప్రసంగిస్తూ. ఒకే జాతిగా ఉండటం అనే భావన, ఒకే దేశంగా ఉండటం అనే భావన వేర్వేరు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment