Irfan Habib
-
గాంధీజీ స్థాయి తగ్గిస్తున్నారు
న్యూఢిల్లీ: జాతిపిత గాంధీజీని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్(87) ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం చాటున గాంధీజీ ప్రతిష్టను మోదీ సర్కారు ‘సీనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్’ స్థాయికి దిగజార్చిందని ఇర్ఫాన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చరిత్రకారులు, కళాకారులు, విద్యార్థులు, వివిధరంగాలవారు పాల్గొన్న కార్యక్రమంలో ఇర్ఫాన్ మాట్లాడారు. గాంధీజీ 150వ జయంతి వార్షికోత్సవాలు ప్రారంభమౌతున్న తరుణంలోనైనా దేశప్రజలు మహోన్నతమైన ఆయనను జాతిపితగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. జాతీయత అంశంపై ప్రసంగిస్తూ. ఒకే జాతిగా ఉండటం అనే భావన, ఒకే దేశంగా ఉండటం అనే భావన వేర్వేరు అని అన్నారు. -
'ఐఎస్ఐఎస్లాగే ఆరెస్సెస్ కూడా మూర్ఖమైనదే'
అలీగఢ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోల్చడంపై హిందూవాదులే కాదు ఉదారవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబిబ్ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కితగ్గడం లేదు. ఐఎస్ఐఎస్లాగా ఆరెస్సెస్ కూడా మూర్ఖమైనదని ఆయన మరోసారి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. 'ప్రజాస్వామిక విలువలను కాపాడాల్సింది ఉదారవాదులే కాదు.. అది అందరి బాధ్యత. లౌకిక విలువలను కాపాడటానికి దేశ ప్రజలందరూ ముందుకురావాలి. ప్రజాస్వామిక, లౌకిక విలువలను ప్రజలు కాపాడుకుంటున్నారని చెప్పడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సంకేతం' అని ఇర్ఫాన్ హబిబ్ తెలిపారు. మతం పేరిట ఉగ్రవాద భావజాలాలు అనుసరించే వ్యక్తుల అజ్ఞానం నేపథ్యంలోనే తాను ఆరెస్సెస్ను ఐఎస్ఐఎస్తో పోల్చానని చెప్పారు. 'అజ్ఞానం, మూర్ఖత్వం విషయంలో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్ ఒక్కటే. 1947నాటి ఘటనలు విద్వేష నేరాల్లో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్ను అధిగమించిందని చాటుతాయి. భారత చరిత్రను ఆరెస్సెస్ తప్పుగా చిత్రిస్తుంది. అది దేశాన్ని కించపరుస్తుంది' అని ఆయన పేర్కొన్నారు. -
గ్రాండ్ ఓల్డ్ లేడి ఆఫ్ బాలీవుడ్ ఇకలేరు!
భారతీయ సినిమా, నాటక రంగానికికు సుదీర్ఘకాలంగా సేవలందించిన ప్రముఖ బాలీవుడ్ నటి జోహ్రా సెహగల్ గురువారం రాత్రి కన్నుమూశారు. అమె వయస్సు 102 సంవత్సరాలు. గురువారం మధ్యాహ్నం గుండె పోటు రావడంతో ఆమెను న్యూఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. మ్యాక్స్ ఆస్పత్రిలోనే జోహ్రా సెహగల్ తుది శ్వాసను విడిచారు. గత నాలుగురోజుల నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని జోహ్రా కూతురు కిరణ్ మీడియాకు వెల్లడించారు. జోహ్రా అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు లోధి రోడ్ లోని శ్మశాన వాటికలో జరుగుతాయని తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ ట్విట్ చేయడం ద్వారా జోహ్రా మరణవార్త తెలిసింది. జోహ్రా మరణం తీవ్ర విషాదం నింపింది. ఆమె పూర్తిస్థాయి జీవితాన్ని ఆస్వాదించారు అని మరో ట్విట్ లో వెల్లడించారు. జోహ్రా మృతి భారతీయ సంస్కృతికి తీరని లోటని అన్నారు. 1935లో ఉదయ శంకర్ తో కలసి నర్తకిగా సినీ జీవితాన్ని ఆరంభించారు. భారతీయ సినిమాతోపాటు, పలు ఆంగ్ల చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లో దిల్ సే, కభీ కుషీ కభీ ఘమ్, హమ్ దిల్ దే చుకే సనమ్, బెండ్ ఇట్ లైక్ బెక్ హమ్, వీర్ జారా, చీనీ కమ్, సావరియా, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నటించారు. గ్రాండ్ ఓల్డ్ లేడి ఆఫ్ బాలీవుడ్ గా జోహ్రాకు పేరుంది. పద్మశ్రీ, పద్మ విభూషణ్ తోపాటు కాళిదాస్ సమ్మాన్ లాంటి అవార్డులను అందుకున్నారు. 102 సంవత్సరాలపాటు జీవించినా.. సినీ ప్రేక్షకుల హృదయంలో చిరకాలం నిలిచిపోతారు. జోహ్రా మృతికి అమితాబ్ తోపాటు పలువురు ప్రముఖు సంతాపం తెలిపారు. T 1541 - Zohra Sehgal passes away at 102 yrs ..what a journey and what an immensely loveable co star ! Prayers for her blessed soul !! — Amitabh Bachchan (@SrBachchan) July 10, 2014 Just confirmed that Zohra Aapa is no more. Cremation tomorrow at 12 PM at Lodhi Road crematorium. RIP @bombaywallah — S l Habib (@irfhabib) July 10, 2014