insulting
-
కొంపముంచిన స్కిట్ బండి సంజయ్ కు షాక్..!!
-
సీఐ అవమానించాడని ఆత్మహత్యాయత్నం
సాక్షి, దుబ్బాక (మెదక్): ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తనను సీఐ అవమానపరిచాడంటూ బాధితుడు ఆరోపించాడు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని నర్లెంగడ్డకు చెందిన వార్డు మెంబర్ ఎమ్మ యాదగిరి శనివారం తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో సీఐ హరికృష్ణ తనను కొట్టి, బూతులు తిడుతూ అవమానించాడని, న్యాయం చేయాలని కోరుతూ బంధువులతో కలిసి పెట్రోల్ బాటిల్‌తో స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ స్పందించి యాదగిరి చేతిలోనుంచి పెట్రోల్ బాటిల్ లాక్కున్నాడు. ఈ ఘటనతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. వివరాలు వెల్లడించిన ఏసీపీ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ చల్లా దేవారెడ్డి విలేకర్లకు వివరించారు. శుక్రవారం రాత్రి నర్లెంగ్డ గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం వేడుకల్లో గ్రామానికి చెందిన ఎమ్మ యాదగిరి, ఎమ్మ లింగం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యాదగిరి కుటుంబసభ్యులపై లింగం వర్గీయులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలకు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. కాగా ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్! -
మోదీకి ప్రేమతోనే జవాబిస్తా
షుజాల్‌పూర్ (మధ్యప్రదేశ్): బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీలు తన కుటుంబంపై ద్వేషం చూపిస్తున్నాయని తను మాత్రం వారికి ప్రేమనే పంచుతానని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ అన్నారు. మోదీ తనతోపాటు తన కుటుంబంపై చూపే ద్వేషానికి ప్రేమతోనే జవాబిస్తానని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై మోదీ బహిరంగ విమర్శలు చేశారని.. దీనికి ప్రతిగా తాను ప్రధానికి కౌగిలింత ఇచ్చానని చెప్పారు. పార్లమెంట్లో తాను రఫేల్ స్కాం గురించి ప్రధానిని ప్రశ్నిస్తే ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా తన కుటుంబం గురించి మాట్లాడారని గుర్తు చేశారు. మెకానిక్‌గా మారిన రాహుల్! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న రాహుల్ గాంధీ మెకానిక్‌లా మారారు. ప్రచారంలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా నుంచి మండికి వెళ్తుండగా.. రాహుల్ హెలికాప్టర్లో సమస్య తలెత్తింది. దీంతో మెకానిక్ కోసం వేచిచూడకుండా స్వయంగా రాహుల్ రంగంలోకి దిగారు. ‘ఉనా పర్యటన సమయంలో హెలికాప్టర్లో సమస్య తలెత్తింది. మేమంతా కలిసి దానిని సరిచేశాం. టీమ్ వర్క్‌తో ఏదైనా సాధించగలం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు’అని పేర్కొన్నారు. ఈ ఫొటోను రాహుల్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. -
రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు
బంకురా/పురూలియా/అజాంగఢ్/అలహాబాద్: ప్రధానిగా తనను అంగీకరించబోనని చెప్పడం ద్వారా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రధానిగా గుర్తించని మమత.. ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రధానిగా గుర్తించడాన్ని గౌరవంగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మమత భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని స్పష్టం చేశారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, మమతా బెనర్జీతో పాటు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మీ చెంపదెబ్బలే నాకు దీవెనలు.. మమతా బెనర్జీ వాడుతున్న భాషను చూస్తేనే ఆమె ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థమవుతుందని మోదీ తెలిపారు. ‘మమతా దీదీ నన్ను చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్లు విన్నాను. నేను మిమ్మల్ని(మమత) అమితంగా గౌరవిస్తున్నా. దీదీ(అక్కా) అని పిలుస్తున్నా. కాబట్టి మీరు కొట్టే చెంపదెబ్బలు నాకు దీవెనల వంటివి. మమతా బెనర్జీకి నిజంగా ధైర్యముంటే ముందుగా బెంగాల్లో చిట్‌ఫంట్ నిర్వాహకులు, ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారి చెంపలు వాయించాలి. అప్పుడే టీఎంసీ అంటే తృణమూల్ దోపిడీదారుల(టోలాబాజ్) పన్ను అనే అపప్రద తొలగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ చెంపదెబ్బలతో పాటు తనను రాళ్లతో కొట్టడం గురించి మాట్లాడుతున్నారని మోదీ విమర్శించారు. ప్రతిపక్షాల దూషణలు తనకు అలవాటు అయిపోయాయనీ, ప్రపంచంలోని డిక్షనరీలన్నింటిలో ఉన్న తిట్లను కూడా అరిగించుకునే శక్తి వచ్చిందని చెప్పారు. ‘ఉపాధి’ కూలీలనూ వదిలిపెట్టలేదు.. పశ్చిమబెంగాల్లో పేరుకే టీఎంసీ ప్రభుత్వం నడుస్తోందనీ, అసలు వ్యవహారాలన్నింటిని తెరవెనుక సిండికేట్ నడిపిస్తోందని మోదీ ఆరోపించారు. ‘ఈ దోపిడీదారుల కారణంగా రాష్ట్రంలోని టీచర్ల నుంచి మేధావుల వరకూ, వ్యాపారుల నుంచి నిరుపేదల వరకూ అందరూ వేధింపులు ఎదుర్కొంటున్నారు. వీరు చివరికి జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కూలీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ కార్మికుల జాబ్‌కార్డులను కూడా లాక్కుంటున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించేందుకు కేంద్రం భారీగా నిధులను అందజేస్తుంటే వాటిని కూడా ఈ దోపిడీదారులు లూటీ చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత తన అధికార దాహంతో పశ్చిమబెంగాల్‌ను సర్వనాశనం చేశారనీ, ఇప్పుడు అధికారాన్ని కోల్పోతానన్న భయంతో మరింత నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. కిచిడీ కూటమికి ఓటేస్తే అంతే.. విపక్షాలు ఏర్పాటుచేసిన మహాకూటమికి ఓటేస్తే దేశభద్రత ప్రమాదంలో పడుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ కిచిడీ కూటమికి ఓటేస్తే దేశంలో అరాచకత్వం, అస్థిరత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బీజేపీ అధికారంలోని రాకముందు ఉగ్రదాడులు అనగానే అజాంగఢ్(యూపీ) పేరు వినిపించేది. ఎందుకంటే ఉగ్రమూకలకు సాయంచేసే వ్యక్తులకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నేతల ఆశీస్సులు ఉండేవి. వీరు అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి కులం, మతం, జాతి వంటి అంశాలను పరిశీలించేవారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉగ్రవాదాన్ని జమ్మూకశ్మీర్, సరిహద్దులోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగాం. ఈ సరికొత్త భారతం ఉగ్రవాదులను వారి ఇళ్లలో దూరి హతమారుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. కాళీమాతకు భయపడండి టీఎంసీ నేతల అకృత్యాలపై తాను మాట్లాడితే మమతా బెనర్జీకి కోపం వస్తోందని మోదీ అన్నారు. కానీ తాను ఈ కోపానికి భయపడబోననీ, ఎందుకంటే 130 కోట్ల మంది భారతీయుల ప్రేమ తనతో ఉందని వ్యాఖ్యానించారు. ‘పశ్చిమబెంగాల్లో చిట్‌ఫండ్ మోసాల కారణంగా సర్వస్వం కోల్పోయిన పేదలు, నిరుద్యోగ యువకులు ఆగ్రహించడంపై మమత భయపడాలి. దుర్గామాత భక్తులు పూజ చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల కాళీమాత ఆగ్రహిస్తుందని మమత భయపడాలి. టీఎంసీ నేతలు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ద్వారా యథేచ్ఛగా సంపాదిస్తున్నారు. కానీ కార్మికులకు మాత్రం కనీస వేతనం చెల్లించడం లేదు’ అని ప్రధాని విమర్శించారు. ఓవైపు మమత తన మేనల్లుడి రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు మంత్రులు, టీఎంసీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారనీ, ఆ పార్టీ కార్యకర్తలు బలవంతపు వసూళ్లకు దిగుతున్నారన్నారు. ఫొని తుపాను సందర్భంగా తాను ఫోన్‌చేసినప్పటికీ మమత స్పందించలేదన్నారు. మే 23తో బెంగాల్లో మమత పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు. -
గాంధీజీ స్థాయి తగ్గిస్తున్నారు
న్యూఢిల్లీ: జాతిపిత గాంధీజీని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్(87) ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం చాటున గాంధీజీ ప్రతిష్టను మోదీ సర్కారు ‘సీనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్’ స్థాయికి దిగజార్చిందని ఇర్ఫాన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చరిత్రకారులు, కళాకారులు, విద్యార్థులు, వివిధరంగాలవారు పాల్గొన్న కార్యక్రమంలో ఇర్ఫాన్ మాట్లాడారు. గాంధీజీ 150వ జయంతి వార్షికోత్సవాలు ప్రారంభమౌతున్న తరుణంలోనైనా దేశప్రజలు మహోన్నతమైన ఆయనను జాతిపితగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. జాతీయత అంశంపై ప్రసంగిస్తూ. ఒకే జాతిగా ఉండటం అనే భావన, ఒకే దేశంగా ఉండటం అనే భావన వేర్వేరు అని అన్నారు. -
పులివెందుల ఘటనపై అవినాష్‌రెడ్డి ఫిర్యాదు
వైఎస్సార్ జిల్లా : తనకు జరిగిన అవమానంపై లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ ద్వారా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన చేతిలోని మైక్ లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒక రౌడీ షీటర్ వేదికపై ఉండటమే కాకుండా తన మైక్ లాక్కుని దౌర్జన్యానికి దిగారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ సభలో వందల సంఖ్యలో టీడీపీ నేతలు వేదికపై ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనతో పాటు ఒక పార్లమెంట్ సభ్యుడినే అవమానించారన్నారు. ఈ ఘటనకు సంబంధించి దినపత్రికలలో ప్రచురితమైన పేపర్ క్లిప్పింగ్‌లు జత చేసి స్పీకర్‌కు పంపారు. తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు. -
కష్టాల్లో మరో ఆప్ నేత!
ముంబయి: మరో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కష్టాల్లో పడే అవకాశం ఉంది. తమ పార్టీ నేతకు మద్దతిచ్చే క్రమంలో జాతీయ నాయకులపై నిందలు వేసినట్లుగా మాట్లాడటమే ఈ పరిస్థతికి కారణమైంది. లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ సీడీ లీకవడమే కాకుండా.. బాధితురాలు కూడా ఫిర్యాదు చేయడంతో ఆప్ బహిష్కృతమంత్రి సందీప్ కుమార్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టు చేసి అనంతరం ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ మాట్లాడుతూ జవహార్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీకి కూడా అక్రమ వ్యవహారాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్ తివారీ అనే వ్యక్తి ఆయనపై ఫిర్యాదు చేశాడు. నెహ్రూ, గాంధీవంటి జాతీయ నాయకులపై ఆరోపణలు చేసి దేశం మొత్తాన్ని అవమానించారని, ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసు నమోదు విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ముంబయిలోని సకానికా స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. -
కుక్కను అవమానించినందుకు 37 ఏళ్ళ జైలు
విశ్వాసానికి మారుపేరుగా శునకాలను చెప్తాం. అంతటి ప్రేమను చూపించే పెంపుడు జంతువులను యజమానులూ ప్రాణప్రదంగా సాకడం కళ్ళారా చూస్తున్నాం. కానీ అదే శునకాన్ని అవమానించిన కారణంగా ఏళ్ళ తరబడి జైలు శిక్షపడటం ఎక్కడైనా చూశారా? ఇప్పుడు థాయిలాండ్ లో అదే జరిగింది. రాజుగారిని దేవుడి అవతారంగా, అత్యంత గౌరవంగా చూసే ఓ సాధారణ వ్యక్తి... ఆయనగారి శునకాన్ని అవమానించాడట.. ఇంకేముందీ అతగాడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్ష పడింది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. థాయ్ చట్టప్రకారం జరిగిన విషయం... సామాజిక మాధ్యమాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... అన్నికష్టాలు కూడా ఉన్నాయనడానికి థాయ్ సంఘటన నిదర్శనంగా చెప్పొచ్చు. అందుబాటులో ఉందికాదాని సోషల్ మీడియాను ఎడా పెడా వాడేస్తే.. ఏమౌతుందో ఈ సంఘటన చెప్పకనే చెప్తోంది. ఓ సాధారణ వ్యక్తి సోషల్ మీడియాలో రాజుగారి కుక్కపై చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు అతడి తలకు చుట్టుకున్నాయ్. థాయిలాండ్ చట్టాల ప్రకారం సైనిక న్యాయస్థానాలు అతడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్షను విధించాయి. సుమారు 2002 సంవత్సరంలో కింగ్ భూమిబోలో అతడి పెంపుడు శునకం టాంగ్ డేంగ్ పై ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తితో ఆ తర్వాత 'ఖూన్ టాంగ్ డేంగ్' పేరిట ఓ యానిమేటెడ్ చిత్రం కూడా రూపొందింది. టాంగ్ డేంగ్ అన్న పేరున్న ఆ సైనిక శునకాన్ని నిజంగా ఆ వ్యక్తి ఏమని దూషించాడో కచ్చితంగా చెప్పలేదు కానీ.. రాచరిక పాలనలో ఉన్నకఠిన చట్టాలను ఉల్లంఘించినందుకే అతడికి శిక్ష విధించి, గతవారం అరెస్టు చేసినట్లు మాత్రం తెలుస్తోంది. -
జాతీయ జెండాకు అవమానం