
వైఎస్సార్ జిల్లా : తనకు జరిగిన అవమానంపై లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ ద్వారా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన చేతిలోని మైక్ లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒక రౌడీ షీటర్ వేదికపై ఉండటమే కాకుండా తన మైక్ లాక్కుని దౌర్జన్యానికి దిగారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ సభలో వందల సంఖ్యలో టీడీపీ నేతలు వేదికపై ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనతో పాటు ఒక పార్లమెంట్ సభ్యుడినే అవమానించారన్నారు. ఈ ఘటనకు సంబంధించి దినపత్రికలలో ప్రచురితమైన పేపర్ క్లిప్పింగ్‌లు జత చేసి స్పీకర్‌కు పంపారు. తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు.

