speakar
-
ఫిరాయింపుల చట్టంపై సమీక్ష కమిటీ: ఓం బిర్లా
ముంబై: ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు కమిటీ వేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీనికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సారథ్యం వహిస్తారని ఆదివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచూ పార్టీలు మారడాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగం పదో షెడ్యూల్లో ఉంది. దీని ప్రకారంఎమ్మెల్యేలు పార్టీ మారినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా అనర్హత వేటు వేయవచ్చు. -
పార్లమెంట్లో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు..
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు డీకే సురేష్, దీపక్ బజి, నకుల్‌నాథ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభలో నిరసనకు దిగొద్దంటూ ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఉభయసభల్లో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీల సంఖ్య146కు చేరింది. మరోవైపు తమ ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు నిరసనలను తీవ్రం చేస్తునే ఉన్నాయి. కాగా డిసెంబర్ 13న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష ఎంపీలు పట్టుబట్టిన చేసిన విషయం తెలిసిందే. సభ్యుల నినాదాలతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. నిరసనలతో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుండటంతో డిసెంబర్ 14 నుంచి ఇప్పటి వరకు 146 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. చదవండి: జైల్లో కూడా కేజ్రీవాల్ విపాసన చేయవచ్చు: బీజేపీ సెటైర్లు -
‘అదంతా డ్రామా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనను ఓ డ్రామాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ చేత సీఎం కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్‌కు దెబ్బతగలడం నిజమైతే ఆ వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. చైర్మన్ ఒకవైపు కూర్చుంటే మరో వైపు ఉన్న కంటికి ఎలా దెబ్బ తగిలిందని నిలదీశారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. అప్పుడు హరీష్ చేయలేదా? గతంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హరీశ్‌రావు బెంచీల మీద దూకుతూ వెల్‌లోకి దూసుకెళ్లలేదా అని గుర్తు చేశారు. ఆయన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై స్పందించని స్పీకర్ మమల్ని సస్పెండ్ చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. స్పీకర్ విధుల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. పార్లమెంట్లో కేసీఆర్ కూతురు స్పీకర్ ముఖం మీద ప్లకార్డులు ప్రదర్శిస్తోందని, ఇక్కడ మేం మాత్రం నిరసన చేపట్టొద్దా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్లో రైతులు, గిరిజనుల గురించి ప్రస్తావన లేదని, ప్రధాన అంశాలు లేవని మేము చెప్పడానికి వెళితే మాపై 50 మంది పోలీసులతో దాడి చేయించారన్నారు. చివరి బడ్జెట్ సమావేశంలో.. సమాధానాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో మాపై సస్పెన్షన్ వేటు వేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నియంతలు అధికారంలోకి రావద్దంటూ ఈ సందర్భంగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ అనే నినాదాన్ని ఇచ్చారు. -
పులివెందుల ఘటనపై అవినాష్‌రెడ్డి ఫిర్యాదు
వైఎస్సార్ జిల్లా : తనకు జరిగిన అవమానంపై లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ ద్వారా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన చేతిలోని మైక్ లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒక రౌడీ షీటర్ వేదికపై ఉండటమే కాకుండా తన మైక్ లాక్కుని దౌర్జన్యానికి దిగారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ సభలో వందల సంఖ్యలో టీడీపీ నేతలు వేదికపై ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనతో పాటు ఒక పార్లమెంట్ సభ్యుడినే అవమానించారన్నారు. ఈ ఘటనకు సంబంధించి దినపత్రికలలో ప్రచురితమైన పేపర్ క్లిప్పింగ్‌లు జత చేసి స్పీకర్‌కు పంపారు. తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు. -
కరువు నివారణకే హరితహారం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోల్‌బెల్ట్ : రాష్ట్రంలో కరువు శాశ్వత నివారణ కోసం కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్‌లో గురువారం సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం హాజరై మెుక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయనిన్నారు. దీనికి గత పాలకులు పర్యావరణ పరిరక్షణపై పట్టించుకోకపోవడమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో 230 కోట్లు మెుక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమం చేపట్టగా ఈ ఏడాది 46 కోట్ల మెుక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ గనులు, ఓపెన్‌కాస్టులు, కార్మికకాలనీలు, స్వాధీన భూముల్లో మొక్కలు నాటడంతోపాటు సంరక్షించుకోవాలన్నారు. సింగరేణి ఇప్పటికే 75 లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. స్పీకర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ హరితహారంపై ప్రతిజ్ఞ చేయించారు. సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు మనోహర్‌రావు, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ, స్పెషల్ ఆఫీసర్ చక్రధర్, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య, ఎస్‌ఓటూ జీఎం సయ్యద్ హబీబ్‌హుస్సేన్, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, వైస్ చైర్మన్ గణపతి, కౌన్సిలర్లు సిరుప అనిల్, కంకటి రాజవీరు, గోనె భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మందల రవీందర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్, కొక్కుల తిరుపతి, కటకం స్వామి, జోగుల సమ్మయ్య, బిబిచారి పాల్గొన్నారు. -
అసెంబ్లీలో విపక్షానికి వింత పరిస్థితి
♦ కరువుకు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధం లేదా..! ♦ వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే పదే పదే మైక్ కట్ ♦ జగన్ ప్రసంగానికి అడ్డుతగిలిన మంత్రులు ♦ పట్టిసీమపై మాట్లాడుతాననగానే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన జగన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం ప్రతిపక్షానికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కరువుపై చర్చలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలను మాట్లాడొద్దని స్పీకర్ కట్టడి చేయడంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీని విస్మయపరిచింది. ప్రాజెక్టులపై మాట్లాడుతానన్న వైఎస్ జగన్‌కు పదే పదే మైక్ కట్ చేసిన స్పీకర్ అధికారపక్ష సభ్యులకు, మంత్రులకు రాజకీయ విమర్శలు చేయడానికి అవకాశం ఇవ్వడం నివ్వెరపరిచింది. కరువుపై స్వల్పకాలిక చర్చపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతున్న సందర్భంలో మంత్రులు జోక్యం చేసుకుని రాజకీయ విమర్శలు గుప్పించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ హయాం లో రైతుల ఆత్మహత్యలు, పట్టిసీమ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ విమర్శించారు. మరోమంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని పట్టిసీమకు అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగితే సమాధానం చెప్పలేదని విమర్శించారు. ఆ తర్వాత స్పీకర్ మైక్ ఇవ్వడంతో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, మంత్రులు లేవనెత్తినందున పట్టిసీమ గురించీ చెబుతానన్నారు. మంత్రులు అడిగిన దానిపై వైఎస్ జగన్ ఒక్కమాట చెప్పారో లేదో స్పీకర్ మైక్ కట్ చేశారు. కరువు, నీటిపారుదల ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి సంబంధం ఉందని జగన్ చెబుతున్నా... స్పీకర్ వినిపించుకోకుండా మైక్ కట్ చేసి, స్పీక్ ఓన్లీ ఆన్ డ్రవుట్(ఒక్క కరువు మీదే మాట్లాడాలి), నథింగ్ ఎల్స్(మరో విషయం మాట్లాడటానికి వీల్లేదు), దట్ ఎజెండా ఈజ్ ఓవర్(ఆ అంశం అయిపోయింది) అన్నారు. ఈ విషయాలు చెబుతూ మాట్లాడమని జగన్‌కు అవకాశమివ్వగా, పట్టిసీమ అనగానే ఎందుకు భయపడుతున్నారు? సందర్భం వచ్చినప్పుడు దానిపైనా మాట్లాడుతానన్నారు. దానికి స్పీకర్ తీవ్రంగా స్పందిస్తూ, కరువు మీద మాట్లాడండి.. లేదా మీ ఇష్టం... అని అన్నారు. అధ్యక్షా... పట్టిసీమ మాట ఎత్తగానే భయపడుతున్నారు. ఇక్కడేం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు అని చెబుతుండగానే మళ్లీ మైక్ కట్..! వైఎస్సార్సీపీ సభ్యులు మూకుమ్మడిగా నిరసన తెలియజేయగా మాట్లాడే అవకాశమిచ్చారు. పట్టిసీమ అనగానే మైక్ కట్ చేస్తున్నారెందుకు అధ్యక్షా...! అని జగన్ ప్రశ్నించారు. అలా అంటుండగానే స్పీకర్ మైక్ కట్ చేసి ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులును మాట్లాడాలని కోరారు. దానికి కాల్వ శ్రీనివాసులు వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఇదే క్రమంలో స్పీకర్ జగన్‌నుద్దేశించి మాట్లాడుతూ, గంటలు... గం టలు మాట్లాడతా అంటే కుదరదు. డోంట్ డీవియేట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్(మాట్లాడాల్సిన అం శంపై పక్కకు వెళ్లొద్దు) అని అన్నారు. దానిపై జగన్ స్పందిస్తూ... ప్రజలు చూస్తున్నారు.. అధ్యక్షా...! ఎందుకు మైక్ కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దాంతో మళ్లీ మైక్ కట్ చేసిన స్పీకర్ మరోసారి కాల్వ శ్రీనివాసులును మాట్లాడాలని కోరారు. దానికి ఆయన ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ దశలో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు తీవ్ర నీటిఎద్దడితో అలమటిస్తున్నారని, సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులకు సంబంధం ఉందం టూ విపక్ష సభ్యులు పోడియం ముందుకొచ్చి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలోనే అధికారపార్టీ సభ్యులు, మంత్రులు ఒక్కొక్కరుగా మాట్లాడటానికి అవకాశం రాగా, ప్రతిపక్షంపై విమర్శలుగుప్పించడంపైనే ఎక్కువ సమ యం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాల్వ శ్రీనివాసులు ఎదురుదాడి కొనసాగిస్తుం డగానే మధ్యలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని వైఎస్ సీఎంగా ఉండగా రూ.లక్షన్నర మాత్రమే పరిహారమిచ్చారని, చంద్రబాబు రూ.5 లక్షలిచ్చారని చెప్పుకొచ్చారు. అనంతరం మళ్లీ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులపై జగన్‌కు, ఆయన తండ్రి వైఎస్‌కు అభిమానం లేదని, ఓదార్పుయాత్ర చేయడం ఒక అలవాటుగా మారిందం టూ పొంతనలేని విమర్శలు గుప్పించారు. మధ్యలో మరోసారి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ సభ్యుడు, డిప్యూటీ సీఎం మాట్లాడగానే స్పీకర్ అర్ధంతరంగా సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. -
స్పీకర్‌నైనా.. మీ మిత్రుడినే
►స్పీకర్‌గా నా మొదటి జీతం కళాశాలకు ఇస్తా ►పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో శాసనసభాపతి ► సిరికొండ మధుసూదనాచారి పరకాల : తాను స్పీకర్‌నైనా మీ మిత్రుడినేనంటూ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని ఎంఎన్‌రావు గార్డెన్లో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్ ఎర్ర సంపత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జన్మనిచ్చిన గడ్డకు, ఈ గాలికి, తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, రాజకీయంగా జన్మనిచ్చిన ఎన్టీ రామారావుకు వందనాలు తెలుపుతున్నానన్నారు. 14ఏళ్లుగా తన సహచరుడిగా భావించి కన్నీళ్లను, కష్టాలను పంచుకుని అత్యున్నత పదవి అప్పగించిన కేసీఆర్‌కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సమైక్యవాద విధానాల వల్లే.. సమైక్యవాద పాలకుల విధానాలతోనే తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని స్పీకర్ అన్నారు. 800 ఏళ్ల క్రితమే కాకతీయులు, రెడ్డి రాజులు ఇక్కడ రామప్ప, లక్నవరం, ఎల్గూరు రంగంపేట, ధర్మసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మించారన్నారు. సమైక్య పాలకులు ఆర్డీస్ ప్రాజెక్టు నీటిని తరలించుకుపోయి పాల మూరు ప్రజలను కూలీలుగా మార్చారని విమర్శించారు. కసి, పట్టుదలతో వచ్చిన ఉద్యమమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందన్నారు. ఒకానొక సందర్భంలో ఉద్యమ పార్టీని మింగేసే కుట్ర జరిగినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి ముందే ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులపై పూర్తి స్థాయిలో విశ్లేషించడం వల్లే ఇంతటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రపంచ విత్తన కర్మాగారంగా వర్థిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి జీతం కళాశాలకే.. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి నాటి గుర్తులను జ్ఞాపకం చేయడం గొప్ప విషయమని స్పీకర్ సిరికొండ కొనియాడారు. విద్యాశాఖమంత్రితో మాట్లాడి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్‌గా తన మొదటి జీతం రాగానే కళాశాల అభివృద్ధికి అందిస్తానని ప్రకటించారు. అనంతరం కళాశాల పూర్వవిద్యార్థులు చారిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు తమకు చదువునేర్పిన గురువులు దగ్గు మనోహర్‌రావు, మొగిలయ్య, బండి కొమురయ్యలను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, డాక్టర్ సంతోష్‌కుమార్, అప్పాల సుధాకర్, కాళీప్రసాద్, ఎర్ర నాగేం దర్, లక్ష్మీనారాయణ, వల్లంపట్ల నాగేశ్వర్రావు, కృష్ణమాచార్య, కృష్ణమూర్తి, ఎంపీపీ సులోచన, రాజమహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. తరగతి గదుల్లో కలియ తిరుగుతూ.. నాకింకా గుర్తుంది. ఇదే గదిలో మా ప్రిన్సిపాల్ అనుముల కృష్ణమూర్తి సార్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డా.. అంటూ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా శనివారం తాను చదువుకున్న కళాశాలను స్పీకర్ సందర్శించారు. వందలాదిమంది విద్యార్థులు, పూర్వవిద్యార్థులు పూలవర్షం కురిపిస్తుండగా కళాశాలలోకి అడుగుపెట్టారు. విద్యాలయ పాఠశాల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం కళాశాల గదులను పరిశీలించారు. తాను చదువుకున్న తరగతి గదిలోకి వె ళ్తూ ఇదే మా తరగతి గది అంటూ అందరికీ చూపించారు. గదిలోకి వెళ్లి బ్లాక్‌బోర్డుపై ‘మెన్ మే కం అండ్ మెన్ మే గో, బట్ ఐ కెనాట్ గో ఫర్ ఎవర్’.. ఇక్కడకు ఎందరో వచ్చి పోతుంటారు.. కానీ నేనెక్కడికీ వెళ్లను.. అని రాశారు. తర్వాత అన్ని గదులను పరిశీలిస్తూ.. స్నేహితులకు వివరిస్తూ తిరిగారు. రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికీ నమస్కరించారు.