'ఉగ్రవాదిని చంపినట్టూ నిన్నూ చంపేస్తాం' | Was Threatened Twice On JNU Case in 24 Hours, says AAP leader Ashutosh | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాదిని చంపినట్టూ నిన్నూ చంపేస్తాం'

Published Tue, Feb 16 2016 9:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

'ఉగ్రవాదిని చంపినట్టూ నిన్నూ చంపేస్తాం'

'ఉగ్రవాదిని చంపినట్టూ నిన్నూ చంపేస్తాం'

న్యూఢిల్లీ: జేన్‌యూ వివాదంపై స్పందించినందుకు తనను చంపేస్తామని 24 గంటల్లో తనకు రెండుసార్లు బెదిరింపులు వచ్చాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సీనియర్ నేత అశుతోష్‌ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉగ్రవాది అఫ్జల్‌ గురుకు అనుకూలంగా కార్యక్రమం నిర్వహించడం, ఈ విషయంలో విద్యార్థులను అరెస్టు చేయడంతో వివాదం రోజురోజుకు తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంలో తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆప్ నేత అశుతోష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'జేఎన్‌యూ వ్యవహారంలో చంపేస్తామంటూ వాట్సాప్‌లో నాకు బెదిరింపులు వస్తున్నాయి. ఉగ్రవాదిని చంపినట్టే మేం నిన్ను చంపేస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో ఇలా బెదిరింపులు రావడం రెండోసారి. దీని గురించి పోలీసులకు తెలియజేశా' అని అశుతోష్ ట్విట్టర్‌లో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement