న్యూఢిల్లీ నుంచే కేజ్రీవాల్ పోటి: ఆప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటి చేస్తారని ఆప్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ అన్నారు. కేజ్రీవాల్ నియోజకవర్గం మార్చుకుంటారని వస్తున్న వార్తల్ని అశుతోష్ ఖండించారు.
కేజ్రివాల్ నియోజకవర్గం మార్చుకోవడం లేదు. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటు నుంచే పోటి చేస్తారని, అతని నాయకత్వంలోనే పార్టీ ఎన్నికల్లో పోటి చేస్తుందని ఆయన తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన జాబితాలో కేజ్రీవాల్ పేరు కనిపించకపోవడంతో మీడియా అడిగిన ప్రశ్నలకు అశుతోష్ స్పందించారు.